Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని 36 గ్రామపంచాయతీలలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు సోమవారం పొంగిపొర్లుతు న్నాయి. చప్టాలపై నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాక పోకలు బంద్ అయిన సంఘటనలు కనబడుతు న్నాయి. పలు గ్రామాలకు చెందిన పత్తి, మిరప తదితర వాణిజ్య పంటలు నీట మునిగాయి. రైల్వే స్టేషన్ తడికలపూడిలో పూర్తిగా రైల్వే లైన్ నీటమునిగింది. మండలంలోని పరికలవాగు, తెల్ల వాగు చెరువు, గడ్డి చెరువు, రోల్లపాడు చెరువుతో పాటు తదితర వాగులు వంకలు నిండిపోయాయి. నిత్యము కోయగూడెం ఓపెన్ కాస్ట్ నుండి తడికలపూడి రైల్వే స్టేషన్కు వెళ్లే వందలాది బొగ్గు లారీలు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న తావ్యుర్య తండా దగ్గర వాగు పొంగిపొర్లడంతో వందలాది బొగ్గు లారీలు నిలిచిపోయాయి. మండల పరిధిలోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నపురెడ్డిపల్లి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, పొంగిపొర్లడదంతో మండల పరిధిలోని పలు గ్రామాల రాకపోకలకు సంభదాలు తెగిపోయినాయి. రాజపురం-అబ్బుగూడెం, రాజపురం-మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి-వెంకటాపురం మధ్య ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెంట్లం గ్రామంలో ప్రజల ఇండ్లలోకి భారీగా వర్షం చేరుకుంది. ముందుగానే తహశీల్దార్ బద్రకాళి వాగులు వైపు, విద్యుత్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చూసించారు. వరద ఉధృతంగా ఉన్న వంతెనలు దగ్గర ఇరువైపులా కంప పెట్టి రహదారులు బంద్ చేయించారు. మరో రెండు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చూసించారు.
మణుగూరు : గత రెండు రోజులగా మణుగూరులో భారీ వర్షాలు కురుస్తుడడంతో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో సోమవారం లోతట్టు ప్రాంతాలలోని ఇండ్లలోకి నీరు చేరాయి. మణుగూరు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరా యం ఏర్పడింది. రోజుకు మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి వుండగా ఉత్పత్తి ఆగిపోయింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు పూర్తి ఆటంకం ఏర్పడింది. పట్టణ ంలోని ఇరువైపుల ఓపెన్ చేసి వున్న డ్రైనేజి కాలువల కారణ ంగా వరదనీరు రోడ్డు మీదకు చేరడంతో ప్రయాణికులకు, వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు.
కొత్తగూడెం : భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలతో నిండిపోయిన విద్యాసంస్థలలో వరద నీరు ఆగకుండా మరమ్మతులు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం అధికారులను కోరారు. సోమవారం వివిధ స్కూల్స్, కాలేజీలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ప్రభుత్వ మహిళా కళాశాలలో చెరువును తలపించే విధంగా నీళ్లు నిలిచి ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు కళాశాలల్లో ఇదే దుస్థితి నెలకొందన్నారు.
గుండాల : సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలెవరూ వాగులు దాటే ప్రయత్నం చేయేద్దని గుండాల గ్రామ పంచాయతీ సెక్రటరీ వట్టం సురేష్ అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఏపీఆర్, మటంలంక మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎంపీఓ వలీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
జూలూరుపాడు : భారీ వర్షానికి మండలంలో పాపకొల్లు గ్రామంలో హై స్కూల్, ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు వల్ల గ్రామస్తులు, స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్న తరు ణంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, గ్రామ పంచాయతీల ఆఫీసర్ ఎంపీవో రామారావు ఫోన్ ద్వారా సమస్యను తెలియజేశారు. స్పందించిన ఎంపీఓ రా మారావు వెంటనే జేసీబీ ద్వారా కాల్వ తీయించి నీళ్లను, తు మ్మల వాగులోకి కలిసే విధంగా చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, ఉప సర్పంచ్ మహేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇల్లందు : రాత్రి నుండి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బుగ్గ వాగు ఉగ్రరూపం దాల్చి పొంగుతుంది. ఇల్లందు పట్టణంలో కొన్ని బ్రిడ్జిల పై నుండి వరద నీరు పారుతుంది. బుగ్గవాగు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు సోమవారం ఆ పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ బుగ్గవాగు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సహాయ చర్యల్లో చైర్మన ్తో పాటు ఇల్లందు మున్సిపల్ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఐదవ వార్డు కౌన్సిలర్ వీణవాసు, నాలుగో వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ అజాం, 18వ వార్డు కౌన్సిలర్ స్వాతి, మణికిరణ్, తదితరులు ఉన్నారు.
అశ్వారావుపేట : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మండల వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. సోమవారం మద్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ కళాశాల వాతావారణం పరిశోధనా కేంద్రం లెక్కలు ప్రకారం 44 మి.మీ వర్షపాతం నమోదు అయింది. దీంతో మండల వ్యాప్తంగా గ్రామాల్లో సైతం లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటికి ముంపుకు గురయ్యాయి. పలు గ్రామాల్లో వీధులు గుండా ఇండ్లలోకి నీరు చేరింది.
మండలంలో గల పెద్దవాగు ప్రాజెక్టుకు సామర్ధ్యం మించి వరద చేరడంతో 2,3 నెంబర్ల గేట్ లను ఎత్తి 22620 క్యూసెక్ లు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ డీఈఎల్ క్రిష్ణ తెలిపారు.