Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ లెనిన్ కాలనీ సమీపంలో పేలిన బాంబు
అ గాయపడిన యువకుడు
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్లలో ప్రసర్ బాంబ్ కలకలం రేపుతున్నది. బాంబ్ పేలడంతో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని లింగాలని సమీప మామిడి తోట వద్ద ఓ చెట్టు కింద వెలసిన మావోయిస్టు పోస్టర్లను చదివేందుకు ఆలం బ్రహ్మనాయుడు అనే యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో ఆ స్థలంలో బాంబ్ పేలి ఆలం బ్రహ్మనాయుడు గాయపడ్డాడు. పోస్టర్లు తొలగించడానికి వచ్చే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు పోస్టర్ అంటించిన చెట్టు కింద బాంబు అమర్చినట్లు భావిస్తున్నారు. బాంబు పేలుడు వల్ల అతని కంటిలో గాజు ముక్కలు దిగినట్లుగా వైద్యులు గుర్తించి భద్రాచలంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కంటి వైద్యం అందించారు.
-బాంబు స్క్వాడ్ తనిఖీలు
బాంబు స్క్వాడ్ బృందం వెంటనే రంగంలోకి దిగి మామిడితోటలో అణువణువు గాలించారు. పోలీసులు నిత్యం కూంబింగ్కి వెళ్ళివచ్చే రహదారి కావడంతో మామిడితోట మొదలుకొని సమీప లెనిన్కాలనీ ఊరి చివర వరకు తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
-మావోయిస్టుల చర్యపై భయాందోళనలు
పోస్టర్ల వద్ద మావోయిస్టులు బాంబు పెట్టడంపై ఏజెన్సీ వాసుల్లో తీవ్ర భయాం దోళనలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు పడినప్పుడు అందరికంటే ముందు ఫొటో లు, వీడియోలు తీసి పాఠకులకు సమాచారం చేరవేయాలని పాత్రికేయులు పరుగులు తీస్తుంటారు. మావోయిస్టులు వేసిన పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాల్లో మ్యాటర్ ఏముందో అని చదవడానికి స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతారు. అలాంటి చోట్ల మావోయిస్టులు బాంబులు పెట్టడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.