Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గూడు ఉన్నా...పునరావాసం
కోసం పరుగు
అ ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వనమా,
కూనంనేని పరిశీలన
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం గత వారం రోజుల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతం అయ్యారు. ఇండ్లు ఉన్నా...పునరవాసం కోసం పరుగుతు తీస్తున్నారు. కుండ పోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు పునరావాసం ఏర్పాటు చేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు మంగళవారం ముంపునకు గురైనప్రాంతాలను పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ముంపు కారణాలపై సమీక్షించారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందున ఇప్పటి ముంపుకు గురైన ప్రాంత ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. మున్సిపల్ పరిధిలోని రామవరం ఏరియా సుభాస్ చంద్రబోస్ నగర్ ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సుమారు 20 నుండి 30 ఇండ్ల ప్రజలు బిక్కుబిక్కుమంటు ఇండ్లలో ఉన్నారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో అంధకారంలో ఉన్నారు. వరద చేరిన సమీప ప్రాంతాల్లోని కొందరు చీకట్లోనే ఉండగా మరి కొందరు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల ఎస్సిబినగర్ నీటి మునిగిన చేదు అనుభవం మరువక ముందే మరోసారి జలదిగ్భందం కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి చుట్టు ఉన్న నీరు తగ్గితేనే కుటుంబాలు వారి వారి ఇండ్లల్లో అడుగు పెట్టే అవకాశం కనిపిస్తుంది. రామవరం ఎస్సిబినగర్ ఏరియాలోని ఇండ్లు, నీటి ముగిన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.