Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మృతురాలి కుటుంబానికి ఆర్ధికసాయం
నవతెలంగాణ-పాల్వంచ
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలిక డ్రైనేజీలో పడి కొట్టుకుపోయి మృతి చెందిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణ అన్నారు. రెండు రోజులుగా కురుస్తున్నబారీ వర్షాలకు వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందిన అంజలి తల్లిదండ్రుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ప్రగాభసానుబూతిని తెలియజేసి ఆర్ధికసాయాన్ని అందజేశారు. అంజలి మృతి విచారమకరమని ఈపాటి చిన్న వర్షాలకే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తే అతిభారీ వర్షాలుపడితే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అంజలి మృతికి నూటికి నూరుశాతం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందిందని ఆరోపించారు. ఇకనైనా స్పందించి అధికారులు పాలకులు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి ఇలాంటి ప్రమా దాలు జరగకుండా చూడాలని వరదలో కొట్టుకు పోయిన అంజలి కుటుంబాలనికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పూనెం అనుదీప్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
అంజలి కుటుంబానికి 10లక్షల ఎక్ప్గేషియా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కూనంనేని
డ్రైనేజీలో కొట్టుకుపోయి మృతి చెందిన అంజలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు వికలాంగుల కాలనీలో శనగ రవి నాగమణి కుమార్తె అంజలి మృతిచెందడంతో ఆయన పరామర్శించి రూ.5 వేల ఆర్ధికసాయాన్ని అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షబీర్పాషా, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు, నాగేశ్వరరావు, విశ్వేశ్వరరావు, అన్నవరపు వెంకటేశ్వర్లు, జ్యోతుల రమేశ్, ముగుందర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
అంజలి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ
వరదల్లో చిక్కుకొని మృతి చెందిన బాలిక శెనగ అంజలి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) పరామ ర్శించారు. బాధిత కుటుంబ పరిస్థితులు విని చెలించి పోయి వెంటనే రూ.10000 ఆర్థిక సహాయం అంద జేశారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల పల్లి శ్రీనివాస్ కుమార్, యువ మోర్చా జిల్లా అధ్యక్షు లు అభినవ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేరు నాగేశ్వరరావు, పాల్వంచ, కొత్తగూడెం పట్టణ అధ్యక్షు లు మానుపురి ప్రభాకర్ తదితరులు ఉన్నారు.