Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతు చట్టాలు లేబర్ కోడ్లకు
వ్యతిరేకంగా 27న భారత్ బంద్
అ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మచారి
నవతెలంగాణ-చర్ల
స్కీం వార్కర్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించచాలని, అందరికీ కనీస వేతనాలు ఇస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ నెల 24న జాతీయ సమ్మెను అన్ని రకాల స్కీంలలో విధులు నిర్వహిస్తున్న స్కీం వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.బ్రహ్మచారి పిలుపునిచ్చారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిన రైతు చట్టాలను లేబర్ కోడ్లను, విద్యుత్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బిఎస్ రామయ్య భవన్లో సీఐటీయూ కన్వీనర్ రాధాకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్లను నానాటికీ బలహీనపరుస్తున్నాయని, వాటికి బడ్జెట్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ప్రైవేటీకరణ చేసేవిధంగా తెచ్చిన కొత్త జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన సూచించారు. ఆశాలకు వేతనంపై 30శాతం పీఆర్సీ సైతం అమలు చేయాలని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కార్మికులకు, రైతులకు శాపంగా మారిందని ఆయన విమర్శించారు. అనేక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, చంద్రకళ, అనురాధ, విజరు, సుజాత స్వరూపా, విజయలక్ష్మి, భోళ్ళ వినోద్, అజరు కుమార్, నాగేంద్రమ్మ శేషు, హైమా తదితరులు పాల్గొన్నారు.