Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏఐకెఎమ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుతరామారావు
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని ఎల్లా పురం గ్రామంలో ఇటీవల అర్ధరాత్రి ఇండ్లలో నిద్రిస్తున్న ఆదివాసీయులపై పోలీసులు దాడులు చేయటం టీఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గమని ఏఐకెఎమ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుతరామారావు అన్నారు. ఎన్డీ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన ఎల్లాపురం వెళ్లి బాధితలను పరామర్శించి, మాట్లాడారు. అనంతరం బయ్యారం మండలంలోని పంది పంపుల గ్రామానికి వెళ్లి వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్, పోలీసులు పెట్టిన తప్పుడు కేసులపై కోర్టును ఆశ్రయించారనే కోపంతో బయ్యారం ఎస్ఐ చిత్ర హింసలు పెట్టటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, సత్యం, నిర్మల, రాంసింగ్, తదితరులు నిజ నిర్ధారణ కమిటీలో ఉన్నారు.