Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇల్లందు పట్టణం మండలాన్ని అతలాకుతలం చేసింది. ఇల్లందులో 11.7, ఓసీలో 13, టేకులపల్లిలో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షపు నీటితో ఓసీలు నిండిపో యాయి. దారులు బురదమయంగా మారిపోయాయి. 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. మండలంలోని ముకుందాపురం క్యాంపు సెంటరులోని శ్రీరామమొహన్ డెకరెట్ టైల్స్ ఫ్యాక్టరీ పొగగొట్టం అధిక వర్షానికి నేల కూలీంది. ఈ ప్రమాదంలో ఏవిదమైన ప్రాణనష్టం జరగలేదు. దీన్ని 1980లో నిర్మించారు. ఎత్తు సూమూరు 50 అడుగుచిలుకు ఉంటుంది. మండలంలోని మమిడిగుడెం పంచాయతీ వెంకటాపురంలోని చెక్ డ్యాం వర్షానికి కొట్టుకుపోయింది. పట్టణ పరిధిలోని స్థానిక 2 వార్డుబి ఇల్లందులాపాడు కాళీ మాత గుడి వెనకాల ఉన్న స్మశాన వాటికకు వెళ్లే వంతెన భారీ వర్షాలకు ధ్వంసం అయింది. వంతెన ధ్వంసం కావడం వల్ల దారి లేక దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా వీలు కాని పరిస్థితి ఏర్పడింది. బుగ్గవాగు వివిధ వార్డుల్లో పొంగి ప్రవహిస్తోంది. మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
భద్రాచలం : ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతోంది. కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 32.7 అడుగులు ఉన్న గోదావరి రాత్రి 7 గంటలకు 34 అడుగులు చేరుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి పెరిగే అవకాశం ఉందని జల వనరుల సంఘం అధికారులు పేర్కొన్నారు.
పాల్వంచ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న గృహాలను పరిశీలించి ముంపు నష్టాన్ని అంచన్నా వేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మున్సిపల్ పరిధిలోని కేసిఆర్నగర్, సోనియానగర్, నవభారత్‌నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి వర్షాలకు పడిపోయిన వంతెనను గృహాలను రోడ్లు డ్రైనేజిలను పరిశీలించారు. దెబ్బతిన్న గృహాలను సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. నేలకొరిగిన విద్యుత్‌స్తంభాన్ని తొలగించి కొత్తస్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుదుత్పని పునరుద్దరిం చాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. తక్షణమే పారిశుధ్య పనులు నిర్వహించి బూడిదను తొలగిం చాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్, డీఈ మురళి, ఏఈ రాజేశ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వాణికుమారి, ఎలక్ట్రికల్ ఎఈ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీరామ్ముర్తి, అజ్మీరా రమేశ్, ఆనంద్, వీరస్వామి, వీరన్న, అక్బర్, రాంబాబు, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాలైన గొందిగూడెం ఇసుక వాగు, తుమ్మల చెరువులోని లోతువాగు, సర్వ పాడు బంజర లోని మెళ్లవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాదస్తాయిని మించి వాగులు ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లోని జనజీవనం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా మారుమూల ప్రాంతాలలోని గిరిజనులు వాగులు దాటే పరిస్థితి లేక ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో నూ మండల కేంద్రానికి రాలేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు.
గోదావరి వరదల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి
మండలంలోని గోదావరి నది పరివాహక గ్రామాలరైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారి సాయి శాంతి కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం మంగళవారం రాత్రికి భద్రాచలం వద్ద 40 అడుగులు చేరుకోనుందన్నారు.
చర్ల : సరిహద్దు ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సోమవారం అర్ధరాత్రి వరకు భారీగా కురిసిన వర్షాలకు మంగళవారం ఉదయం తాలిపేరు నదిలోకి 36,810 క్యూసెక్కుల నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై 19 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 36700 నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. గంటగంటకు వరద తాకిడి పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 74 మీటర్లు కాగా 73.10 మీటర్లుగా నీటి నిల్వ ఉంచి అధికంగా వచ్చిన నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. సాయంత్రం 7 గంటల వరకు క్రమేపీ తగ్గిన నీటిని అంచనావేసి17 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 27397 క్యూసెక్కుల నీటిని దిగువన గల గోదావరిలోకి విడుదల చేశారు. కాగా దండకారణ్యంలో ఉన్నా రాళ్లవాగు, గళగంవాగు, చింతవాగు, రోటెంతవాగు, పూసువాగు, జెర్రీ పోతుల వాగు, చీకటి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తాలిపేరు వాగులో కలవడంతో తాలిపేరు ప్రాజెక్టు ఉన్న 24 గేట్లను అధికారులు 19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొం ది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటిని క్రమబద్ధీకరిస్తుంది ఇరిగేషన్ డీఈఈ తిరుపతి తెలిపారు.
అన్నపురెడ్డిపల్లి : మండలంలోని ఎడతెరపులేని కురిసిన వర్షాలకు వాగుకు ఉన్న వంతేనెలు, రోడ్లు అన్ని కొట్టుకుపోయాయి. దీంతో పలు గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యాలకు అంతరయంగా మారినాయి. అబ్బుగూడెం-రాజపురం గ్రామాల మధ్య ఉన్న వాగు పొర్లిపోవడంతో వంతెన నెర్రబారింది. ఇదే తరహాలో మరో రొండు, మూడు రోజుల, పాటు వర్షాలు కురిస్తే వంతేన కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చోట వంతెన ఉన్నా దాటాలేక మరో చోట వాగుకు వంతెన లేక రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు.
దుమ్ముగూడెం : మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఓ మోస్తరు భారీ వర్షాలకు వర్షపు నీరు రహదారులపై వరదలా పారుతోంది. మండలంతో పాటు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గడ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకల్లోకి వర్షపు వరద చేరి మండలంలో ఉన్న ప్రధాన వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతోపాటు సున్నం బట్టి బై రాగులపాడు గ్రామాల మధ్య రహదారిని వర్షపు వరదలు ముంచెత్తడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకు జనజీవనం సైతం అతలాకుతలం అవుతుందని చెప్పవచ్చు.
మణుగూరు : మణుగూరు సబ్ డివిజన్లో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అధిక వర్షాల కారణంగా వాగులు పొంగడంతో పట్టణంలోని పలు ఏరియాలోని ఇండ్లలోకి వరదనీరు చేరింది. మంగళవారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్, కాళీమాత ఏరియా, సుందర్యనగర్, శేషగిరినగర్, సమితిసింగారం పంచాయతీ పరిధిలోని పైర్‌స్టేషన్ ప్రాంతంలో వరద భీభత్సవం సృష్టించింది. దీంతో సరాసరి వరదనీరు ఇండ్లలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుందరయ్యనగర్ ఏరియాలో మురికి కాలువలో మట్టిని ఒడ్డుకు వేశారు. దానిని తొలగించకుండా ఆలానే వుంచడంతో వరద రావడంతో మళ్లీ మట్టి కాలువలోకి వెళ్లడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. మున్సిపల్ సూపర్ వైజర్లు డబ్బులు ఇచ్చిన ఇంటి ప్రాంతాలోనే మట్టిని తొలగిస్తున్నారని, డబ్బులు ఇవ్వాని ఏరియాలో మట్టిని తొలగించకపోవడంతో వరద చేరి ఇబ్బందులకు గురవతున్నామని ప్రజలు వాపోయ్యారు. వర్షాల కారణంగా సింగరేణిలో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు నిలిచిపోయ్యాయి. పంచాయతీలోని పలు ప్రాంతాలలో వరద నీరు పోటేత్తడం, రేగులగండికి అలుగు పడడంతో కూనవరం రైల్వేగేట్ వద్ద కోడిపుంజుల వాగుకు అధిక వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయి సింగరేణి కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆళ్ళపల్లి : మండల వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు మంగళవారమూ కొనసాగాయి. భారీగా కురిసిన వర్షాలకు మండలంలో కిన్నెరసాని, జల్లేరు, కోడెల, ఇసుక వాగులు రాత్రుల్లో ఉధృతంగా ప్రవహించాయి. కిన్నెరసాని, జల్లేరు వాగుల వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాయిగూడెం, సీతానగరం, కర్ణగూడెం, బోడాయికుంట, అడవిరామవరం, దొంగతోగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, అత్యవసర పరిస్థితుల్లో, నిత్యావసర వస్తువులకు, ఆఫీస్ పనులకు మండల కేంద్రానికి వచ్చే గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒకరికొకరు చేతులు పట్టుకుని కిన్నెరసాని, జల్లేరు, తదితర వాగులు దాటుతున్నారు. అలాగే మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో భారీగా వరదనీరు వచ్చి చేరటంతో అన్ని చెరువులు, కుంటలు అలుగులు పోశాయి. మండల కేంద్రంలోని కసనబోయిన వెంకన్న అనే రైతు ఎకరం వరి పొలంలో కొన్నిచోట్ల నీట మునిగింది.
కాగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి వేసిన అన్నదాతలు పంటనష్టపోతామేమోనని ఆందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉన్న అంతర్గత గ్రావెల్ రోడ్లు, వీధులు బురద మాయమయ్యాయి. కలెక్టర్ ఆదేశానుసారం తహశీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా ఏరోజుకారోజు లోతట్టు ప్రాంతాల దగ్గర మండల ప్రజలకు ప్రాణహాని జరగకుండా రెవెన్యూ సిబ్బందిని ఉంచుతున్నారు.