Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఆశ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లతో కలిసి మంగళవారం మండల వైద్యాధికారి శ్రీదేవికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 12,500 నుంచి 30 శాతం పిఆర్సీ అమలు చేయాలని,ఆశా కార్యకర్తలకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని,పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్న పారితోషికాలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు జతల యూనిఫాం వెంటనే ఇవ్వాలని,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మేడికొండ నాగేశ్వరరావు, ఆశా కార్యకర్తల మండల అధ్యక్ష, కార్యదర్శులు బేతపూడి మల్లేశ్వరి, బోడ జ్యోతి, సుభద్ర, శరభమ్మ, పుష్ప, నాగమణి, మమత, లత, సుజాత, అరుణ, సావిత్రి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు : ఆశా వర్కర్లకు పీఆర్సీలో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 న జరిగే జిల్లా కలక్టరేట్ ధర్నా కార్యక్రమా న్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం .వేంసూరు లో భోజన విరామ సమయంలో ఆశా వర్కర్లు సమావేశంలో మల్లూరు మాట్లాడారు.
వైరా టౌన్ : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తారీఖున జరగనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు కోరారు. మంగళవారం ఆశ వర్కర్లు వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి పలు డిమాండులతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారికి డాక్టర్ సుచరితకు అందించారు. కార్యక్రమంలో సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు, ఆశ వర్కర్లు శైలజ, ప్రమీల, సుజాత, విజయ, రేణుక, రజిని, మంగ, పద్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.