Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
ప్రధాన రహదారి పక్కన గల గ్రామ పంచాయతీలు రోడ్డుకు ఇరువైపులా మూడు లైన్లు మొక్కలు నాటక పోవడంపై కలెక్టర్ చాలా ఆగ్రహంగా ఉన్నారని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రధాన రహదారి పక్కన గల గ్రామ పంచాయతీల సర్పంచులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శు లకు కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిపిఓ మాట్లాడుతూ కలెక్టర్ సోమవారం బోనకల్ మీదుగా ఎర్రుపాలెం వెళ్లారని, ఆ సమయంలో ప్రధాన రహదారుల పక్కన గ్రామ పంచాయతీలు రోడ్లకు ఇరువైపుల మూడు లైన్లు మొక్కలు నాటాక పోవటం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే తాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో గ్రామ పంచా యతీలకు నిధులు లేవని ప్రతినెల మొదటి తేదీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాకపోయినా ప్రతి నెల మొదటి తేదిని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, కానీ గ్రామపంచాయతీలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారుల పక్కన వెంటనే మూడు లైన్ల మొక్కలు నాటాలని ఆదేశించారు. రోడ్ల వెంట త్రీ గార్డెన్లు కనిపిస్తున్నాయని, కానీ మొక్కల కనిపించడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉదయం ఎనిమిది గంటలకల్లా గ్రామ పంచాయతీ విధులులో ఉండాలని ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ ఈ నెల చివరి వారంలో మొక్కలు నాటడం విషయంపైనే బోనకల్ మండలానికి వస్తారని చెప్పారని అప్పటికల్లా ప్రధాన రహదారి పక్కన గల గ్రామ పంచాయితీలు అన్ని రోడ్డుకు ఇరువైపులా మూడు లైన్ల మొక్కలు నాటడం పూర్తిచేయాలని, లేనియెడల సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డిఎల్పిఓ పుల్లారావు, ఈజిఎస్ ఏపిడి సుంచు శ్రీనివాసరావు, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఎంపీఓ కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
బోనకల్ సర్పంచ్‌ని
అభినందించిన డీపీవో
బోనకల్ గ్రామ సర్పంచ్ భూక్యా సైదా నాయక్‌ను డిపిఓ ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. బోనకల్ గ్రామ పంచాయతీలో జిల్లాకే ఆదర్శవంతంగా వైకుంఠధామాన్ని నిర్మించడం, వైకుంఠ వాహనాన్ని ఏర్పాటు చేయటం, ఫ్రీజర్ బాక్స్ ను ఏర్పాటు చేయడం పట్ల డిపిఓ సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచులు అందరూ ఈ విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా ప్రయత్నాలు చేసుకోవాలని కోరారు.
పాఠశాలలో కరోనా నిబంధనలను
తప్పనిసరిగా పాటించండి
పాఠశాలల్లో తప్పనిసరిగా కరోనా నిబంధన లను పాటించాలని డిపిఓ వి.ప్రభాకర్ రావు ఉపాధ్యాయులను కోరారు మండల కేంద్రమైన బోనకల్ గిరిజన కాలనీలో గల ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శిం చారు. గిరిజన కాలనీలోని ఇళ్లల్లోకి వెళ్లి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి , సర్పంచ్ సైదా నాయక్, ఉపసర్పంచి రాఘవ, పంచాయతీ కార్యదర్శి కిరణ్ పాల్గొన్నారు.