Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-గాంధీచౌక్
జుబ్లీ క్లబ్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన న్యాయవాదులు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజరు కుమార్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాలతో సత్కరించి వినాయకుడి బొమ్మను బహూకరించారు. అనంతరం మంత్రి అజరు కుమార్ మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా సీనియర్ న్యాయవాదులను, మరియు న్యాయవాద సోదరీ సోదరులను కలుసుకొని వీరి మధ్య గడపటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. న్యాయవాదులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు డి.కృష్ణారావు, హరేందర్ రెడ్డి, పసుపులేటి శ్రీనివాస్ రావు, బెల్లం ప్రతాప్, కె.రామారావు, టీ.హైమావతి, ఎండీ.ఇర్షాద్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు స్టాండింగ్ కౌన్సెల్స్ బసవపున్నయ్య, పోట్ల శ్రీకాంత్, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు .