Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇరువురి అరెస్ట్ : ఏఎస్పీ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని రాజుపేట కాలనీలో గత ఏడాది జరిగిన వృద్ధురాలి హత్య కేసును భద్రాచలం పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ఇరువురిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఏఎస్పీ జి.వినీత్ వెల్లడించారు. భద్రాచలంలో రాజుపేట కాలనీలో ఎస్కి జాన్ బీ అనే వృద్ధురాలు తన ఇంట్లో అనుమానాస్పదంగా గత ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన మృతి చెందింది. మృతురాలి కొడుకు ఎస్కె ఖాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు మృతురాలి పోస్టుమార్టం రిపోర్టు నివేదికలో మృతురాలి గొంతు చుట్టూ బిగించడం వల్ల చనిపోయినట్టు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు హత్య కేసు కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో లభించిన కొన్ని ఆధారాల ప్రకారం మృతురాలి మేనల్లుడు భద్రాచలంలోని ఏఎస్ఆర్ కాలనీకి చెందిన యస్.కె. నన్నేశా, తన స్నేహితుడు భద్రాచలం ఎంపీ కాలనీకి చెందిన కాపుల శివప్రసాద్‌తో ఈ వృద్ధురాలిని పథకం ప్రకారం హత్య చేయాలని పథకం రచించినట్టు ఏఎస్పీ తెలిపారు. మృతురాలి వద్ద డబ్బులు, బంగారం ఉన్నదని ఆశపడి ప్రణాళిక ప్రకారం ఆమెను చంపి, ఆమె ఇంట్లో నుండి నగదు, ఒక బంగారు గొలుసు, సెల్ ఫోన్ తీసుకొని పారిపోయారు. ఇదిలా ఉండగా సీఐ స్వామి ఆధ్వర్యంలో భద్రాచలంలో మంగళవారం ఆచూకీ కోసం వెతుకుతుండగా పట్టుబడ్డారు. ఈ ఇరువురి వద్ద నుండి మృతురాలు బంగారు గొలుసు, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన సీఐ టి.స్వామి, ఎస్ఐను, పోలీసు సిబ్బంది ఏఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ టి.స్వామి, యస్.ఐ మన్మధరావు, ప్రొఫెషనల్ ఎస్ఐ రంజిత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.