Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వీఆర్ఓల సమస్యలు పరిష్కరించాలి
అ కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న వీఆర్ఓలు ఏ శాఖలో పనిచేస్తున్నామో మాకే తెలియదని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు వీఆర్ఓలు ఆందోళన చేశారు. ముందుగా స్థానిక కొత్తగూడెం క్లబ్లో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్లర్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాకా శ్రీను, ప్రధాన కార్యదర్శి అశోక్ చౌహాన్ మాట్లాడారు. 2020 గవర్నర్ రాజముద్ర ద్వారా రద్దుకాబడి ఒక సంవత్సరం అయినప్పటికీ నేటికీ ఏ శాఖలో విలీనం లేక, విధులకు సంబంధించి సరియైన స్పష్టత లేక, నేటికి ఏ హౌదా కేటాయించకపోవడం వలన గ్రామ రెవెన్యూ అధికారులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి గ్రామాల్లో ధన, ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు సంబంధించిన నివేదికలు సంబంధిత శాఖలకు అందజేయం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో అక్రమ మట్టి, ఇసుక రవాణాను అరికట్టుటలో కూడా గ్రామ రెవెన్యూ అధికారులము అయిన మేము కీలకంగా వ్యవహరించామని గుర్తుచేశారు. రద్దు చేసిన గ్రామ రెవెన్యూ అధికారులకు విధులు బాధ్యతలు అప్పగించాలని, వేరే శాఖలోకి బదిలీ చేయదలిస్తే వారినుండి అప్షన్స్ తీసుకోవాలని సూచించారు. అర్హతను బట్టి రెవెన్యూ శాఖలొనే సర్దుబాటు చేయాలన్నారు. అర్హత కలిగిన వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలి. తదితర న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వీఆర్ఓలు పాల్గొన్నారు.