Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అధికారులు పర్యవేక్షణ చేయాలి
అ సాంప్రదాయాలతో పాటు రక్షణ చర్యలను పాటించాలి
అ కలెక్టర్ అనుదీప్
కొత్తగూడెం : సాంప్రదాయాలతో పాటు రక్షణ చర్యలను పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన గణేష్ ఉత్సవ కమిటీ, రెవిన్యూ, పోలీస్, పంచాయతీ, ఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లుతో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉత్సవాలను పరమ పవిత్రంగా నిర్వహించుటకు ప్రజలందరూ సహకరించాలని చెప్పారు. గణేష్ మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవడంతో పాటు విద్యుత్ వినియోగానికి అనుమతులు తీసుకోవాలని చెప్పారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది గణేష్ మండపాలలో ఏర్పాట్లును పరిశీలన చేయాలని ఆదేశించారు. ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ విగ్రహాలు ఏర్పాటు చేయనున్న మండపాల వివరాలను ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్లో 'అప్లోడ్ చేయాలని చెప్పారు. మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, డిపిఓ రమాకాంత్, అగ్నిమాపక అధికారి క్రాంతికుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జెవిఎల్. శిరీష, ఆర్టిఓ వేణు, మున్సిపల్ కమిషనర్లు, ఉత్సవ కమిటీ సభ్యులు కంచర్ల చంద్రశేఖర్, రంగాకిరణ్, కామేష్, రాంబాబు, పలివేల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.