Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పర్మినెంటు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
అ అక్టోబర్ 4 ఛలో హైదరాబాద్
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంచాలని, పర్మినెంటు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 4 ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ పిలుపు నిచ్చారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రశాంత్ నగర్, సంజరు నగర్ పంచాయతీలలో జిపి వర్కర్స్ యూనియన్ (సీఐటియూ) ఆధ్వర్యంలో విస్తృత జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు. డెంగ్యూ, కరోనా లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలుతున్న సందర్భంలో కూడా కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జోరునవర్షంలో కూడా తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారని, వీరికి పీఆర్సి అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పి 2నెలలు దాటుతున్నప్పటికీ ఇంతవరకు అమలుకు పూనుకోలేదని ఆరోపించారు. రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు కూడా చెల్లించడం లేదని తెలిపారు.
సెప్టెంబర్ 13న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, అక్టోబర్ 4వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పూల్సింగ్, సుబ్బారావు, నరసింహారావు, సమ్మయ్య, ఆదిలక్ష్మి, సావిత్రి, మంగ తదితరులు పాల్గొన్నారు.