Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
చుట్టూ దట్టమైన పచ్చని అడవి. ఆ దండకారణ్యంలో ఒక ఎత్తైన కొండ శిఖరం. దాని మీద 11వ శతాబ్దపు పురాతన పెద్ద రాతి గణనాథుడి విగ్రహం. ఈ గణపతిని దర్శించాలంటే చత్తీస్ఘగ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లాలోని దోల్కాల్ కొండ మీదకు వెళ్ళాల్సిందే. ఫార్సా గ్రామం నుండి 9 లేదా 11 కిలోమీటర్లు కాలినడకన దండకారణ్యంలో వెళ్ళాలి. రోడ్డు మార్గం లేదు. 1100 సంవత్సరాల పూర్వం నాటిదైన ఈ స్వామి మూర్తిని స్థానిక జర్నలిస్ట్ 2012లో కనుగొన్నారు. ఈ విగ్రహం ఒక్క చిన్న స్థంభం లాంటి కొండ మీద, దాదాపు 3,000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి మాములు మానవుడు నడిచి వెళ్ళడం కూడా అసాధ్యం. అలాంటిది. ఎంతో బరువున్న ఈ విగ్రాహాన్ని అంత ఎత్తున ఎవరు పర్తిష్టించారు. ఎలా ప్రతిష్టించారు. అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంది.
ఎన్నో పరిశోధనల ప్రకారం దోల్కాల్ గణేష్ విగ్రహం నాగవంశీయులు కాలంలో విగ్రహం ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. దీనికి దగ్గర్లోనే ఎన్నో రాతి ఆయుధాలు స్థానికులకు దొరికాయి. ఇవి ఇక్కడ నివసించిన ఆదిమానవుడు జీవిత విశేషాలకు నిదర్శనాలని భారత పురావస్తు శాఖ వారు భావిస్తున్నారు. ఇంతకు ముందు పరిమితంగా స్థానిక ప్రజలకు మాత్రమే తెలిసిన, ధోల్కల్ గణేష్ 2012లో ఒక జర్నలిస్ట్ దానిని తిరిగి కనుగొన్నప్పుడు. దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాడు. అయితే, జనవరి 2017లో గణేష్ విగ్రహం అకస్మాత్తుగా కనుమరుగైంది. దర్యాప్తులో, విగ్రహం కొండ దిగువన 56 ముక్కలుగా విడిపోయి దొరికింది. వాస్తవానికి, బాధాకరమైన, ప్రమాదకరమైన శోధన ఆపరేషన్ ఉన్నప్పటికీ, విగ్రహం అన్ని విరిగిన భాగాలను తిరిగి పొందలేదు. తరువాత, పురావస్తు శాస్త్రవేత్తల బృందం అందుబాటులో ఉన్న అన్ని ముక్కలను ఒకచోట చేర్చి, అదే కొండపై విగ్రహాన్ని తిరిగి స్థాపించింది. నేటికీ, విరిగిన ముక్కల గుర్తులు విగ్రహంపై ఇప్పటికి కనిపిస్తాయి.
దట్టమైన అడవిలో కొండపైన ఈ భారీ, అందంగా చెక్కిన గణేశ విగ్రహాన్ని ఎప్పుడు, ఎలా ఉంచారో ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతంలో నాగ్వాన్షి పాలనలో 9 నుండి 11వ శతాబ్దంలో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు అన్ని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.2012లో స్థానిక జర్నలిస్టు ఒకరు ఈ దోల్కల్ కొండ ఎక్కగా.. శిఖరాగ్రాన ఆరు అడుగులు ఎత్తయిన వినాయకుడి విగ్రహం దర్శనం ఇచ్చింది. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి చేరడం అంత తేలికేం కాదు. ముందుగా దంతెవాడ చేరుకొని అక్కడికి 20 కి.మీ. దూరంలో ఉన్న మిడ్‌కుల్నర్ అనే చిన్న గ్రామానికి వెళ్లాలి. అక్కడి నుంచి 5-7 కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్తే గానీ ఈ ప్రదేశానికి చేరుకోలేం.
ఇప్పుడు మావోయిస్టుల సమస్య కొద్దిగా తగ్గింది గానీ.. గతంలో ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కవగా ఉండేది. గతంలో ఈ విగ్రహం కొండ మీది నుంచి కిందకు పడి ముక్కలైంది. వినాయకుడి విగ్రహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో.. ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇవన్నీ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయనే ఉద్దేశంతో మావోయిస్టులే ఈ విగ్రహాన్ని కొండ మీద నుంచి కిందకు తోసేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.
కొండ మీద విగ్రహం కనిపించడం లేదని ప్రచారం జరగడంతో.. ఇది చోరీకి గురైందని భావించారు. కొందరు వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి విగ్రహం వెతుకులాట ప్రారంభించారు. కొండ కింది ప్రాంతంలో ఈ విగ్రహం ముక్కలు లభ్యమయ్యాయి. దీంతో దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్, కలెక్టర్ సౌరభ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. తర్వాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.