Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఘనంగా కళోజీ జయంతివేడుకలు
నవతెలంగాణ-కొత్తగూడెం
తన యాస, భాషల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియచేసిన మహౌన్నతుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశపు హాలు నందు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ఆయన ''జయంతిని నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలోను ఇటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలోను చురుకుగా పాల్గొన్న వ్యక్తి ఆయన అని చెప్పారు. కవిత్వాలు వ్రాసిన ప్రజాకవి, ప్రజల తరుపున హక్కులు అడిగిన మహానుబావుడదని, ప్రజల గొంతుకగా ఉద్యమం నడిపి మొత్తంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నినదించారని గుర్తుచేశారు. తన జీవితాన్ని తెలంగాణ జాతి కొరకు అంకితం చేశారని, 'పుట్టుక నీది...చావు నీది...బ్రతుకంతా దేశానిది' అన్న గొప్ప వ్యక్తి కాళోజి అని నివాళి అర్పించారు.1992 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషన్ అందుకున్నారని తెలిపారు.
అచ్చమైన ప్రజాకవి కాళోజి-గ్రంధాలయ చైర్మెన్ దిండిగాల
ప్రజా సమస్యలు పరిష్కరించటం చేతగాని పాలకులు ఉన్నా లేకున్నా ఒక్కటే అంటూ ప్రభుత్వ విధానాలపై, పెత్తందారీ తనంపై గొడవకు దిగిన నిజమైన ప్రజాకవి కాళోజీ అని తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. గురువారం కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దిందిగల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రంధపాలకురాళ్ళు వరలక్ష్మి, జి.మణి మృదుల, ఆఫీస్ సిబ్బంది రుక్మిణి, శైలజ, పాఠకులు జయరామ్