Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు
అ ఆందోళనలో తల్లిదండ్రులు
నవతెలంగాన -అశ్వాపురం
అశ్వాపురం మండల కేంద్రంలోని గౌతమినగర్ కాలనీలో గల అణుశక్తి కేంద్రియ విద్యాలయంలో విద్యార్థుల పట్ల వివక్ష కొనసాగుతోంది. ప్రధానాచార్యుల నిబంధనలతో కూడిన విద్యాబోధనతో నాన్-డీఏఈ విద్యార్థులు తీవ్రమైన వివక్షకు గురౌతున్నారు. భారజల కర్మాగార ప్రభావిత గ్రామాల పరిధిలోని పిల్లలకు 10శాతం శాతం నిష్పత్తిలోని భాగంగా విద్యాబుద్ధులు అందించాల్సిన అవసరం ఉన్నది. అందుకు అనుగుణంగా విద్యార్థుల నియామకాన్ని చేపట్టినప్పటికీ ఉమ్మడి విద్యను అందించాల్సిన యాజమాన్యం ఉద్యోగుల పిల్లలు, ఉద్యోగేతర పిల్లలను విభజించి తరగతులు నిర్వహిస్తూ పసి హృదయాల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అలాగే ఆన్లైన్ తరగతుల పేరుతో కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను జోడిస్తూ అనుసరించాల్సిందిగా పేర్కొనబడింది. నర్సరీ నుండి ఎనిమిదోవ తరగతి వరకు రెండు నుంచి మూడు విడతలుగా గరిష్ట కాలపరిమితి 40 నిమిషాలుగా నిర్ణయించారు. దానిని తుంగలో తొక్కిన యాజమాన్యం ఏకకాలంగా