Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీచౌక్ : తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి, తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ డి.లక్ష్మి ప్రసన్న తెలిపారు. కాళోజీ నారాయణ రావు జయంతి పురస్కరించుకొని మార్కెట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు.
కల్లూరు : కొర్లగూడెం గ్రామంలో టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాళోజి నారాయణ జయంతి వేడుకలను నిర్వహఙంచారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కట్టా అజరు కుమార్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు పసుమర్తి చంద్ర రావు, సర్పంచ్ బై రెడ్డి నరసింహారెడ్డి, డిసిసిబి డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, ఏఎంసి డైరెక్టర్ కట్టా ఆర్లప్ప, బండి స్వామి, చాట్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అని ఎంపీపీ బొడ మంగిలాల్ తెలిపారు గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాళోజి నారాయణ రావు జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జయరాం, ఎంపిఓ రాజేశ్వరి, పీఆర్ జెఈ ఇర్ఫాన్, సోలిపూరం సర్పంచ్ హలావత్ జ్యోతి శ్రీనివాస్, బచ్చోడు తండా సర్పంచ్ బాణోత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : మండల పరిషత్ కార్యాలయంతోపాటు వై లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో గురువారం కాళోజి నారాయణరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తూమాటి శ్రీనివాస్, ఎంపీడీవో డి శ్రీనివాసరావు, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, సిపిఎం నాయకులు రాయబారపు బుచ్చయ్య, ఎంపిఓ పి సూర్యనారాయణ, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి సురేష్, ఏఎంసి డైరెక్టర్ బంక మల్లయ్య, వెంకటాపురం గ్రామసర్పంచ్ కోటి అనంత రాములు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ :కాళోజి నారాయణరావు జయంతిని మండల పరిధిలో జలగంనగర్ లోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి ఎంపీపీ బెల్లం ఉమ పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎంపీవో శ్రీనివాసరావు, పర్యవేక్షణాధికారి సుధాకర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కారేపల్లి : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు పూమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మాలోత్ కిషోర్, ఎంపీడీవో కార్యాలయ సూపర్నిటెండెంట్ జీఎస్ఆర్ మూర్తి, ఎంపీవో టీవీఎల్‌ఎన్ శాస్త్రీ, ఉమాదేవి పాల్గొన్నారు.
బోనకల్ : బోనకల్ మండల పరిషత్ కార్యాలయంలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహిం చారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని శ్రీ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీవో కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, ఎస్బిఐ మేనేజర్లు చింతల పవన్ కుమార్, శ్రీధర్, ఏపీజీవబీ మేనేజర్ బోడ సీతారాములు, మండల పరిషత్ కార్యాలయం సూపర్డెంట్ తన్నీరు నరేంద్ర, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
కొణిజర్ల : తహశీల్దార్ కార్యాలయంలో గురువారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్ జి క్రిష్ణ, డిప్యూటీ తహశీల్దార్ విజరు బాబు, యూడిసి విజరు, జూనియర్ అసిస్టెంట్ రాము, ఎఎస్‌ఓ కమలదేవి, ఆర్ఐ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఖమ్మం : కలాన్ని అక్షర అణ్వస్త్రంగా వాడిన భాషాభిమాని కాళోజీ అని గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్ అన్నారు . గురువారం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించారు.కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది అర్జున్, భాస్కర్, అఖిల్నా, నాగన్న, కోటెశ్వరరావు తదితురులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం :కాళోజీ నారాయణరావు తెలంగాణ భాష వైతాళికుడు అని జమలాపురం శ్రీ వెంకటేశ్వ ర స్వామి ఆలయ చైర్మన్ కష్ణ శర్మ, మిరియాల రమణ గుప్తా పేర్కొన్నారు. గురువారం కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తాసిల్దార్ జగదీష్ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ కె ఎం ఎం అన్సారీ, సర్పంచ్ మొగిలి అప్పారావు, పుల్లారెడ్డి, ఆర్ఐ భాష, చారి పాల్గొన్నారు.