Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఉద్యోగ భద్రత కల్పించాలి
అ పిఆర్సి ప్రకారం వేతనాలు అమలు చేయాలి
అ ఆశా వర్కర్ల ఆందోళన....
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.21 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఆర్సి అమలు చేసి వేతనాలు ఇవ్వాలని, పారితోషకాలు వద్దూ... కనీస వేతనం ఇవ్వాలని సిఐటియూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంవి. అప్పారావు, ఏజే.రమేష్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆశా వర్కర్ల పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముందుగా సిఐటియూ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాయకు మాట్లాడారు. కరోనా కాష్టం కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకుసేవలందిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఆషాలకు ప్రభుత్వం పెంచిన 30 శాతం పిఆరిసి వెంటనే చెల్లించాలని, సంబంధిత జిఓలను తక్షణమే విడుదల చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన అధిక ధరలకు, తోడు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని దీని వలన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2020 సెప్టెంబర్ 25న జాయింట్ మీటింగ్ సందర్భంగా ఇచ్చిన హామీలు స్మార్ట్‌ఫోన్, రిజిష్టర్స్ తదితర హామీలు వెంటనే అమలు చేయాలని,11వ పిఆర్సి ఉత్తర్వులు వెంటనే సవరించాలి. ఆషాలకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని,. జి.ఓ. నెం. 60 ప్రకారం అన్ స్కిల్డ్ కార్మికులకు చెల్లించే రూ.15,600లు ఆషాలకు వర్తింపచేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్లు ఫిక్సిడ్ వేతనం రూ.10 వేలు చెల్లించాలని,కరోనా వ్యాక్సిన్ డ్యూటీపైన పిహెచ్సీలకు వెళుతున్న ఆషాలకు టిఎ,డిఎ చెల్లించాలని, తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి.పద్మ, గద్దల శ్రీనివాస రావు, గూడెపూరి రాజు, చీమల రమణ, ఝాన్సీ, ధనలక్ష్మి, జయ, రాంబాయి, రుక్మిణి, కిరణ్ కుమారి, సుశీల, సుగుణ, రమణ తదితరులు పాల్గొన్నారు.