Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
అ పాడెగట్టి మోసిన మహిళలు
నవతెలంగాన-కొత్తగూడెం
కరోనా కష్టకాలంలో ప్రజలు బతకడమే కష్టంగా ఉన్న తరుణంలో కేంద్రం ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి పేద ప్రజలు, మహిళపై భారాలు మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పెంచిన డీజిల్, వంట గ్యాస్, పెట్రోల్, నిత్యవసర ధరలు వెంటనే తగ్గించాలని భద్రాద్రి కొత్తగూడెం మహిళ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను పాడెగా మోసుకు వచ్చి స్థానిక బస్టాండ్ సెంటర్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దేవిప్రసన్న మాట్లాడారు. కేంద్రం మోడీ సర్కార్ పెంచిన పెట్రోల్. డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులు పెంచి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చి 7సంవత్సరాలు గడుస్తున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యఅవసర సరుకులు అనేక సార్లు ధరలు పెంచారన్నారు. సామాన్య ప్రజలు ఇప్పుడు ఉన్న కారోనా పరిస్థితుల్లో బ్రతకడం అతి కష్టంగా ఉందని తెలిపారు. మూటిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా పేదవాడిపై మోడి ప్రభుత్వం ధరల మోతతో సామాన్య గృహుణులను ఇబ్బందులకు గురిచేస్తుంద న్నారు. ఈ కార్యక్రమములో బర్ల నాగమణి, పొదిలి జ్యోతి, గీన్నారపు యమున, శ్రావణి, పూనేం చంద్రకళ, తేజవత్ దేవి, తీరుమల, గంగా, యస్.మణి, మరియమ్మ, భాగ్య, మంద చంద్రకళ, నిర్మల, రజిత, దార్ల సావిత్రి, శ్రీలక్ష్మి, సుశీల, కృష్ణవేణి, దివ్య, కోమలి, పద్మ, బండరీ నిర్మల,బోయ లక్ష్మీ పాల్గొన్నారు.