Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నూతన కమిటీ ఎన్నిక
అ అధ్యక్షులుగా మన్యం జవహర్‌రెడ్డి
నవతెంలగాణ-కొత్తగూడెం
లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం నిత్యం ప్రజాసేవలో ముందుకు పోతుందని, భవిష్యత్తులో మరిని సేవా కార్యక్రమాలు చేయనున్న ట్లు లయన్స్ క్లబ్ సీనియర్లు సభ్యులు కోనేరు పూర్ణచందర్ రావు, మొరిశెట్టి మోహన్ రావు,ఆముదాల వేంకట నరసయ్య అన్నారు. గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం 2021-22 సంవత్సరం మొదటి జనరల్ బాడీ సమావేశము కొత్తగూడెం క్లబ్ నందు పల్లపోతు వాసు అధ్యతక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గడచిన 55 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ద్వారా సేవా దృక్పదంతో ముందు సాగుతుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బల్లలు, వాటర్ ప్లాంట్స్, విద్యార్థులకు, పేదలకు దుస్తులు, కరోనా సమయంలో అనేక మందికి ఆహారం పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రంణ ఆపరేషన్లు, ఉచితంగా కంటి ఆపేరేషన్లు అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వార వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నూతనంగా ఎన్నిక అయిన సభ్యులు వారి శక్తి వంచన లేకుండా కృషి చేసి లయన్స్ క్లబ్ పేరు ప్రతిష్టాలు మరింత పెంచాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో 56 సంవత్సరాలుగా క్లబ్ ద్వార విశిష్ట సేవలు అందించిన మొరిశెట్టి మోహనరావునిఘన సన్మానం చేశారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ద్వారా బహుకరించ బడిన ప్రత్యక బాడ్జ్ని ప్రస్తుత ప్రెసిడెంట్ మన్నెం జవహర్ రెడ్డికి లయన్ కోనేరు పూర్ణ చందర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు.
నూతన కార్యవర్గం
లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం నూతన కమిటీ వీరే... క్లబ్ ప్రెసిడెంట్ మన్నెం జవహర్ రెడ్డి, కార్యదర్శి పి.ప్రభాకర్ రావు, ట్రెజరేర్ కె.వెంకన్నలను ఘనంగా శాలువా లతో సత్కరించారు.