Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బి.మధు
మణుగూరు : మరణించిన కాంట్రాక్ట్ కార్మికుడు పట్ల అధికారులకు, కార్మికుల కు వున్న జాలీ సింగరేణి యాజమా న్యానికి లేదా అని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు ప్రశ్నించారు. గురువారం అడ్డా మీటింగ్‌లో పాల్గొని మాట్లాడుతూ... ఇటీవల సింగరేణిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పర్మినెంట్ కార్మికులు, ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మరణించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. కోలిండియా సర్క్యూలర్ ప్రకారం ప్రమాదం జరిగిన, కరోనాతో మరణించిన వెంటనే రూ.15లక్షల పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని అనేక సర్య్కూలర్లు, డైరెక్టర్ పా హామీ ఇచ్చినప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమన్యం కాంట్రాక్ట్ కార్మికుట పట్ల దుర్మార్గం ప్రవరిస్తుందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వెల్పున చిన వెంకన్న కె.సత్యనారాయణ, కరోనా కారణంగా మృతి చెందిన బొల్లెం శ్రీకాంత్ ల కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి అర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మృతుడు బొల్లెం శ్రీకాంత్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు వున్నారన్నారు. వారి కుటుంబం ఉపాధి లేక పిల్లలను చదివించలేక ఇబ్బందులకు గురవతున్నారన్నారు. వెంటనే సింగరేణి యాజమన్యం ఈ కుటుంబాలను ఆదుకోని కోలిండియా సర్క్యూలర్ ప్రకారం రూ.15లక్షలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో ఓసి2ను, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలచే ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుల గద్దల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.