Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రాచలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
నవతెలంగాణ-భద్రాచలం
త్రిపుర రాష్ట్రంలో సీపీఐ(ఎం) కార్యాలయాలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాల దాడులను ఖండిస్తూ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు యం.బి. నర్సారెడ్డిలు మాట్లాడారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతుందని, ఓర్వలేని ఆర్ఎస్ఎస్, బీజేపీ మూకలు, సీపీఐ(ఎం) కార్యాలయం పై దాడులకు తెగబడ్డారని అన్నారు. నాయకుల పైన, పార్టీ ఆఫీసులపై దాడులు చేసి ప్రజా ఉద్యమాలు ఆపలేరని అన్నారు. త్రిపుర రాష్ట్రంలో బీజేపీ పాలనను ఆ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సిపిఎం కార్యాలయాలపై, వ్యక్తులపై బిజెపి గూండాల దాడులను ప్రజాస్వామిక వాదులు, అభ్యుద యవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు బి.బి.జి.తిలక్, పట్టణ కమిటీ సభ్యులు పి.సంతోష్ కుమార్,యన్. నాగరాజు, కుంజా శ్రీనివాస్, సిహెచ్ మాధవరావు, యం.వి.యస్. నారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భూపేందర్, పార్థి శాఖా కార్యదర్శులు మాజీ ఎంపీటీసీ చేగొండి శ్రీనివాస్, మందా రమణయ్య ,బి.దర్మారావు, తదితరులు పాల్గొన్నారు.