Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు రాజు
నవతెలంగాణ-గుండాల
ప్రపంచ మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన మేధావి, మానవ సమాజానికి సమ, సమాజ మార్గం చూపిన మార్క్సిస్టు మహౌపాధ్యాయుడు కామ్రేడ్ మావో అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నాయిని రాజు అన్నారు. గురువారం కామ్రేడ్ మావో 45వ వర్ధంతి సభ మండల కేంద్రంలో పార్టీ జిల్లా నాయకులు ఈసం శంకర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెయ్యి ఆలోచనలు సంఘర్శించనీ, వంద పూలు వికసించని అని పిలుపునిచ్చి అనేక ఆలోచనల సంఘర్షణలో నుండి శ్రామికవర్గ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచి చైనాలో శ్రామిక వర్గ రాజ్యాన్ని స్థాపించి ప్రపంచ మానవాళికి దిక్చూచిని అందించిన ప్రపంచ శ్రామికవర్గ మహౌపాధ్యాయుడు కామ్రేడ్ మావో అని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో మార్క్సిజాన్ని, భారతదేశ నిర్దిష్ట పరిస్థితికి అన్వయించుకొని విప్లవోద్యమాన్ని నిర్మించే కర్తవ్యాన్ని చేపట్టడమే కామ్రేడ్ మావోకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. భారతదేశంలో విప్లవకారులు అనేక ఆలోచనల సంఘర్షణను సరైన పద్ధతిలో కొనసాగించలేకనే చీలికలుగా ఏర్పడి విప్లవోద్యమ నిర్మాణానికి ఆటంకంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామ్రేడ్ మావో రచనలను, మార్క్సిస్టు సిద్ధాంతాలను అధ్యయనం చేయటం ద్వారా దేశంలోని విప్లవకారులను ఐక్యం చేసి బలమైన కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పూనుకోవడం ద్వారా కామ్రేడ్ మావోకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ డివిజన్ నాయకులు వాంకుడోత్ అజరు, గుండాల మాజీ సర్పంచ్ కొమరం శాంతయ్య, అనంతోగు మాజీ సర్పంచ్ ఈసం చంద్రయ్య, మండల నాయకులు బొర్ర వెంకన్న, సింగన్న, ఎనగంటి గణేష్ ,సనప కుమార్, పాపయ్య, శ్రీను, తెల్లం రాజు, కోడూరి జగన్, పూనెం మంగయ్య, కుంజ నరేష్, మోకాళ్ళ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.