Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
మహిళల హక్కులకై గళమెత్తి పోరాడుతున్న సంఘం ఐద్వా అని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి అన్నారు. గురువారం ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం బండి పద్మ అద్యక్షన జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐద్వా తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనెల 24, 25, 26 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులతో ఐద్వా రాష్ట్ర 3వ మహాసభలు జరుగనున్నట్లు తెలిపారు. దేశావ్యాప్తంగా కోటీ ఇరువై లక్షల సభ్యత్వం కలిగి వుందనీ అన్నారు. ప్రస్తుతం స్త్రీల హక్కుల కోసం నిర్విరామంగా కృషి చేస్తూనే, దేశంలో మహిళలపై పెరుగుతున్న హింసా, అసమానతలు, వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతుందనీ అన్నారు. నేటికి మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం దాల్చలేదనీ అన్నారు. బ్రూణ హత్యలు పెరిగిపోయాయనీ, విచ్చల విడిగా మద్యం దుకాణాలు, అశ్లీల చిత్రాలు, అనవసరమైన సీరియల్స్ వలన నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. నేడు పనిచేయాడానికి ఉపాధి లేక తినడానికి పౌష్టికాహారం లేక రక్తహీనతకు గురై మహిళలు చనిపోతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దివాళకోరు ఆర్దిక విధానాల వలన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కొనలేని, తినలేని పరిస్థితులు దాపురించాయని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, జిల్లా నాయకులు బుగ్గవీటి సరళ, ఆఫ్రోజ్ సమీన, మెరుగు రమణ, నాగ సులోచన, మేహరున్నిస బేగం, పయ్యావుల ప్రభావతి, పిన్నింటి రమ్య, సరస్వతి, బీబి, కృష్ణవేణి, సునీత, వనమా లక్ష్మి, బొడ్డు పద్మ, విజయ, కమలమ్మ, భాగం అజిత, సుమతి మందడపు పద్మ, గుడిమెట్ల రజిత, షేహనాబి తదితరులు పాల్గొన్నారు.