Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని, ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులకు ఆశా కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు 30 శాతం పిఆర్సి ఇస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారని, నేటి వరకు ఇచ్చిన హామీ అమలు కాలేదని వారు తెలిపారు. ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ధర్నా కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి బి. అమల అధ్యక్షత వహించారు. అనంతరం ప్రతినిధి బృందం అదనపు కలెక్టర్ మధుసూదన్‌కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వేణు, ఏడుకొండలు, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు బి.కోటేశ్వరి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పి.మోహన్‌రావు, పి.రమ్య, గోపాల్, నవీన్‌రెడ్డి, కళ్యాణ్, పగిడి కత్తుల నాగేశ్వరరావు, యూనియన్ నాయకులు రమణ, నాగమణి, జ్యోతి, రాణి తదితరులు పాల్గొన్నారు.