Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దాడులపై కమిటీ వేస్తున్నాం అ నివేదిక అనంతరం చర్యలు : జీఎం
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి 21 ఇంక్లైన్ గని మేనేజర్ పై యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల శ్రీనివాసు ఆధ్వర్యంలో జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం మల్లెల సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధికారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ గని మేనేజర్ యూనియన్ నేతపై దాడి చేశారంటూ పత్రికలలో వచ్చిన వార్త పూర్తి అవాస్తవమని, యూనియన్ నాయకుడే మేనేజర్‌పై దాడి చేశారని అన్నారు. సింగరేణి అధికారిపై యూనియన్ నేత దాడి చేయడంతో అధికారులందరూ భయబ్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని జీఎంను కోరారు.
సంఘటన పై జీఎం స్పందిస్తూ అధికారిపై దాడి జరిగిన వివరాలు అందజేయుటకు ఒక కమిటీని వేస్తున్నామని వారి నివేదికను పరిశీలించిన పిదప యూనియన్ నాయకునిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం సభ్యులు డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ పసుల రమేష్, ఇంజనీర్ ఈర్య నాయక్, సీనియర్ ఎస్టేట్ అధికారి తౌర్య నాయక్, పర్సనల్ అధికారి శ్రీహరి తదితరులున్నారు.