Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హ్యాట్రిక్ నాయుకూడా యువ నాయుకుడా..?
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ఎవరకు వారే యమునా తీరే అన్నట్లుగా మండలంలో టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు నడుస్తుంది. మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు రెండు సార్లు గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నవారు అంత తాటి మనుషులుగా ఉన్న వారికే పదవులు లభించి పదవులు అనుభవించారు. రెండు సార్లు మండల అధ్యక్ష పదవి చేపట్టి, టీఆర్యస్ పార్టీని నడిపించి, మూడవ సారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని సుధాకర్ రావు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు ఒకే వేదిక మీద వున్న మండల కేంద్రంలోని ఎంపీటీసీ కృష్ణారెడ్డి మరికొంతమంది నాయకులు విడిపోయి మరో వర్గంలా మండల అధ్యక్ష పదవికి పోటీలో నిలుస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యేను కలిస్తే మరొకరు మాజీ ఎమ్మెల్యేను కలుస్తున్నారు. ఎన్ని వర్గాలు ఉన్న పాత మాజీ గ్రామ అధ్యక్షులు సగం మంది గతంలో మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు నియమించిన వారే ఉన్నారు. తాజా శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు వారినే కొనసాగిస్తే తనదైన ముద్ర ఉండదని వారి స్థానంలో కొత్తవారికి స్థానం కల్పించి తనదైన ముద్ర వేసుకొని పార్టీని నడిపించుకోవాలని, లేని పక్షంలో మునుముందు రాజకీయ చదరంగంలో పెను మార్పులు సంభవిస్తాయని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
మండలంలో కొన్ని గ్రామాల్లో కమిటీలు ఇళ్లల్లో కూర్చొని రాసుకున్నారని టీఆర్యస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన నాయుకులును కనీషం పిలువకుండా ఏకపక్షంగా కమిటీలు వేసుకున్నారని చర్చించుకుంటు న్నారు. ఇప్పటకే రెండు సార్లు మండల అధ్యక్ష పదవి చేపట్టిన సుధాకర్ రావు ఈ సారి కూడా అధ్యక్ష పదవి చేజిక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తారా? లేకపోతే మరో వర్గానికి కట్టబెడతారా? చర్చనీయంసంగా మారింది. ఏదీ ఏమైనా రాజాకీయంలో మండలంలో గట్టి పట్టు ఉన్న సుధాకర్రావుపై తొలిసారిగా కృష్ణారెడ్డి అడుగుపెట్టి మండల కేంద్రంలో ఎంపీటీసీగా పోటీ చేసి భారీ విజయాన్ని సాధిస్తారా లేదా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.