Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
హైదరాబాద్‌లో అభంశుభం తెలియని ఆరేండ్ల గిరిజన బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి అంబేడ్కర్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపి, మాట్లాడారు. ఎస్పీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు ఇవాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండి పడ్డారు. జిల్లాలో ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, అసెంబ్లీ కన్వీనర్ బొంతు, కిరణ్, గుడివాడ రాజేందర్, వంగా రవిశంకర్, చుంచుపల్లి మండల యూత్ అధ్యక్షులు కళ్యాణ్, అరుణ్ కుమార్ ఉటుకూరి విజరు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై లైగింగ దాడి చేసి హత్యచేసిన నింధితున్ని కఠినంగా శిక్షించాలని దిశ ప్రొటేక్షన్ వేల్పేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహి ళలు ర్యాలీ నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నింధితుడు రాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మానవ మృగం అరచాకానికి బాలి అయిన ఆరేండ్ల చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి కలగాలని మండల కేంద్రంలో లంబడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొ వ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడా పద్మ వెంకన్న రాజు చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : ఆరేండ్ల గిరిజన బాలిక చిన్నారి చైత్రని అతి పాశవికంగా హత్య చేసిన నింధితులను శిక్షించాలని కోరుతూ, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఆదివారం రాత్రి నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద చిన్నారికి శ్రద్ధాంజలి ఘటించి, చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ భాద్యుడు కె.మురళీ మోహన్ కుమార్ మాట్లాడారు. నింధితుడ్ని శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు హన్సి, అపర్ణ, రాంప్రసాద్ రెడ్డి, పవన్ కుమార్, నాగరాజు, అంబికా సురేష్, శ్రీనివాస్, అనురాధ, మైధిలి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, పద్మ, మధులిక, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : చిన్నారి చైత్రపై కర్కశంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన మానవ మృగంపై సత్వర చర్యలు తీసుకొని, తక్షణమే మరణశిక్ష విధించాలని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారి చైత్ర ఆత్మ శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఏడుళ్ల బయ్యారం (క్రాస్ రోడ్డు) పెట్రోల్ బంకు సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ ర్యాలీని ఉద్దేశించి పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, బిల్లా నాగేందర్, సనప భరత్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవకులు ప్రముఖ గాయకులు సిద్దెల హుస్సేన్, పినపాక ప్రెస్ క్లబ్ పాత్రికేయులు బురా శంకర్, బిల్లా నాగేందర్, సనప భరత్, నిమ్మ లింగారెడ్డి, కిసర సుధాకర్ రెడ్డి, నిట్ట వెంకటేశ్వర్లు, బి.నరేష్ ,దొడ్డి శ్రీనివాస్, కొప్పుల సంపత్, గొడిశాల చంద్రం, యోగి, రమేష్, నగేష్, కోటి, దిలీప్, శ్రీరామ్ బృహస్పతి తదితరులు పాల్గొన్నారు.