Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-నేలకొండపల్లి
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నాడు నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరుల త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 11 నుంచి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ జాతా ఆదివారం నేలకొండపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దు గ్రామం పైనంపల్లి వద్ద జాతాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేలకొండపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కర్నాటి కృష్ణయ్య స్తూపం వద్దకు చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి భూస్వామ్య, పెత్తందార్ల ను రజాకార్ల మూకలను తరిమి కొట్టి తెలంగాణకు విముక్తి కలిగించింది కమ్యూనిస్టులే అన్నారు. బిజెపిది పోరాట వారసత్వం కాదని వారిది నైజాం వారసత్వం అన్నారు. అమరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకొని నేటి పాలకులు అనుసరిస్తున్న రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
ముదిగొండ : తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్ఫూర్తితో ప్రజాఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన బస్సు యాత్ర ఆదివారం గోకినేపల్లి, ముదిగొండ చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ భూపోరాట వీరులు యరమనేని వెంకట నరసయ్య, మచ్చ వీరయ్య, రావెళ్ళ సత్యం భూపోరాట అమరవీరుల స్థూపాల వద్ద పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు పాల్గొనలేదని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే పాల్గొని తమప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల లింగయ్య, సిపిఐ బోనకల్లు, ముదిగొండ మండల కార్యదర్శిలు రామాంజనేయులు, రావులపాటి శ్రీనివాసరావు, గంగాధరబాబు తిరుపతమ్మ పాల్గొన్నారు.