Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
హైదరాబాద్ మహానగరంలో సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు గూగులోతు శారద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రావినూతల గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో ప్లే కార్డులతో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, బాలికల, మహిళల రక్షణకై ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రావినూతల గ్రామంలో బాలికల సంఘం, మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం రక్తం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు భానోత్.స్వప్న, బాలికల సంఘం నాయకురాళ్ళు గుగులోతు. సంగీత, హాసిని, వేదశ్రీ, బానోతు యోగిత, శ్రావ్య, పల్లవి, శశిర, హాసిని, తదితరులు పాల్గొన్నారు.