Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చావుబతుకుల్లో తండ్రి, మేనమామ
అ జైత్రాంతండాలో విషాదం
నవతెలంగాణ-కారేపల్లి
తల్లి పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆమెను ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను రక్షించుకోవటానికి కావల్సిన పైకంతో మోటర్‌సైకిల్‌పై బయలుదేరిన తనయుడు, భర్త, సోదరులకు ఖమ్మం జిల్లా మంచుకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాధితురాలి తనయుడు దారావత్ సురేష్(26) మృతి చెందగా భర్త దారావత్ సూర్య, సోదరుడు కేలోత్ గోపిలు తీవ్రంగా గాయపడిన ఘటన కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలం జైత్రాంతండాకు చెందిన దారావత్ కౌసల్య వ్యవసాయ పనుల విషయమై క్షణికావేశంలో పురుగుమందు తాగింది. ఆమెను కొత్తగూడెం అసుపత్రికి తీసుకెళ్ళగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం అసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బాధితురాలి తనయుడు దారావత్ సురేష్, భర్త సూర్య, సోదరుడు కేలోత్ గోపిలు ఇంటి నుండి మోటర్ సైకిల్‌పై ఖమ్మం వెళ్ళుతున్నారు. మంచుకొండ వద్ద గుర్తుతెలియని వాహనం వీరు వెళ్లుతున్న మోటర్ సైకిల్‌ను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ తల రెండుగా చీలి అక్కడికక్కడే మృతి చెందగా, సూర్య కాలు తెగిపడి అపస్మారక స్ధితిలోకి వెళ్ళాడు. గోపి తీవ్రగాయాలైనాయి. వీరిలో సూర్య పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉంటూ ఉత్సహం ఉండే సురేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అముకున్నాయి. ఒకే ఇంటిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు ప్రాణాప్రాయస్ధితిలో ఉండటంతో ఈ కుటుంబం దుఖసాగరంలో మునిగింది.