Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ
అ సిటీ కోఆర్డినేటర్ ఆర్.పార్వతిరెడ్డి
నవతెలంగాణ- గాంధీచౌక్:
జాతీయస్థాయిలో నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ టెస్టు-2021 (ఎన్ఈఈటీ) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 3,421 మంది హాజరుకావాల్సి ఉండగా 3,287 మంది హాజరయ్యారు. నగరంలోని 9 కేంద్రాల్లో నిర్వహించిన ఈ టెస్టుకు 134 మంది గైర్హాజరైనట్లు నీట్ సిటీ కోఆర్డినేటర్ ఆర్.పార్వతీరెడ్డి తెలిపారు. సుమారు వారం రోజుల పాటు ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించామన్నారు. ప్రతి సెంటర్‌కు అబ్జర్వర్లు, సెంటర్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేశామన్నారు. వారు అభ్యర్థులకు తగు సూచనలు ఇస్తూ పరీక్ష ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేశారని తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఎన్-95 మాస్క్‌ను అందజేశామన్నారు. కోవిడ్ నిబంధనలు పటిష్టంగా అమలు చేశామని తెలిపారు.