Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 24/7 అందరికీ అందుబాటులో ఉండే మంత్రి పువ్వాడ
అ సుడా చైర్మన్
బచ్చు విజరుకుమార్
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తి అని ఖమ్మం సుడా చైర్మన్ విజరు కుమార్ అన్నారు. ఆదివారం 11,12,13,14,15 డివిజన్లు, కవిరాజ్ నగర్, రోటరీ నగర్, మధుర నగర, గొల్లగుడెం, కొత్తగూడెం కార్పొరేటర్లు ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో సుడా చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 2న టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను నిర్వహించుకున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ధైర్యమని గులాబీ జెండా ప్రజలకు అండ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అన్నారు. ప్రతి కార్యకర్త మంత్రి పువ్వాడ అజరు కుమార్ చేపట్టిన అభివృద్ధిని జనాల్లో తీసుకెళ్లా పని చేయాలని కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసిగా సైనికులు లాగా పనిచేయాలన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా మంత్రి పువ్వాడ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ, వలరాజు, సరిపుడి రమాదేవి సతీష్, చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.