Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 'నవతెలంగాణ' పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక సీపీఐ(ఎం) ఖానాపురం హవేలీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన 'నవతెలంగాణ' పుస్తక ప్రదర్శన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన ఆ పోరాటంలో పూర్తి భాగస్వామ్యం కమ్యూనిస్టులదే అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర, అమరుల పోరాట స్ఫూర్తి, సమకాలీన రచనలు, విజ్ఞాన పుస్తకాలతో కూడిన నవతెలంగాణ పుస్తక ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. ఆదివారం ప్రారంభమైన ఈ ప్రదర్శన సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుందని 'నవతెలంగాణ' జనరల్ మేనేజర్ ఎం. సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, నాయకురాలు పిన్నింటి రమ్య, సీపీఐ(ఎం) నాయకులు దొంగల తిరుపతిరావు, నవతెలంగాణ బుకహేౌస్ సిబ్బంది కణతాల వెంకటేశ్వర్లు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.