Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ త్యాగాల చరిత కమ్యూనిస్టులదే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణలో నైజాం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని పద్ధతి మార్చు కోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. సాయుధ పోరాట జాతా ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించింది. నేలకొండపల్లి, గోకినేపల్లి, ఖమ్మంజిల్లా సరిహద్దు పైనంపల్లి వద్ద జాతాకు కమ్యూనిస్టు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఎం.వెంకటాయపాలెం, వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా ఖమ్మం చేరుకున్నారు. పాత బస్టాండ్ వద్ద జాతాకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పాత బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఎస్కె జానిమియా అధ్యక్షతన జరిగిన సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు పంచితే ఇప్పటి పాలకులు పట్టాలున్న భూములను సైతం గుంజుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మత విద్వేపాలను రెచ్చగొడుతూ కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అమ్మేస్తున్న మోడీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాలం చెల్లిందని మాటలతో కాలం గడుపుతూ తొడలు కొట్టి, జబ్బలు చరిచే వారి పని పట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు. అవకాశం దొరికితే కమ్యూనిస్టులను విమర్శించడం కొంత మందికి ఫ్యాషన్‌గా మారిందని గతం, వర్తమానం, భవిష్యత్తు లేని నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతుంటారని కమ్యూనిస్టులను విమర్శించే ముందు మీరేం చేశారో. ప్రజలకు చెబితే మంచిదని సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అనిల్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహ్మద్ మౌలానా, అమ్ముల జితేందర్ రెడ్డి, శింగు నర్సింహారావు, బిజి క్లెమెంట్, పోటు కళావతి పాల్గొన్నారు.