Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిత్యకృత్యంగా మారిన వేధింపులు
అ కరోనాతో మరింత అధికం
అ గృహ హింస కేసులే ఎక్కువ
అ ఆ తర్వాతి స్థానం ప్రేమ పేరుతో వెంటబడటం..
అ ఇదీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సఖి కేంద్రాల కేసుల తీరు
అ తాజాగా వెంకటగిరికి చెందిన యువతి ఆత్మహత్య
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
నిత్యం మనం పత్రికలు, టీవీలు చూస్తుంటాం. కానీ రాష్ట్రంలో ఏదో ఒకచోట మహిళలపై వేధింపుల వార్తలు లేకుండా..వినకుండా ఒక్కరోజైనా గడిపామా? మగువలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయనేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా సఖి వన్‌స్టాప్ కేంద్రాల్లో నమోదవుతున్న కేసులే నిదర్శనం. బాధిత మహిళలు, బాలికల కోసం 2017 డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సఖి కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలపై జరిగే హింసను నియంత్రించడమే కాకుండా హింసకు గురికాకుండా కాపాడాలనే లక్ష్యంతో వీటిని నెలకొల్పారు. మూడున్నరేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,825 కేసులు ఈ కేంద్రాల్లో నమోదయ్యాయి. వీటిలో గృహహింస, ప్రేమ పేరుతో వేధింపుల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 2017 డిసెంబర్ నుంచి 2021 ఆగష్టు 31వరకు ఈ కేంద్రానికి 1,064 కేసులు రాగా 431 కేసులను పరిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 761 కేసులకు 584 క్లియర్ చేశారు. ఖమ్మంలో 40.50%, కొత్తగూడెంలో 76.74% కేసులకు పరిష్కారం చూపారు. సఖి కేంద్రం వరకు వస్తున్న కేసులే ఈస్థాయిలో ఉంటే ఫ్యామిలీ కోర్టులు, లోక్‌అదాలత్‌లు, పోలీసుస్టేషన్లు, పంచాయతీ, కుల పెద్దల వరకు వచ్చిన కేసులు అనేకం ఉన్నాయి.
- ఉమ్మడి ఖమ్మం జిల్లా సఖి కేంద్రాల్లో నమోదైన కేసులు...
(2017 డిసెంబర్ నుంచి 2021 ఆగష్టు 31 వరకు)
కేసులు ఖమ్మం భద్రాద్రి
గృహ హింస 753 498
లైంగిక దాడి 22 03
లైంగిక వేధింపులు 07 07
పిల్లలపై లైంగిక వేధింపులు 64 18
బాల్యవివాహాలు 14 11
మిస్సింగ్, కిడ్నాప్, లవ్ ఎఫేర్ 82 14
సైబర్ క్రైం, చీటింగ్, లవ్ మేరేజ్ 40 57
వరకట్న వేధింపులు, మరణాలు 01 31
సీనియర్ సిటిజన్, ఆస్తి గొడవలు 32 116
ఈవ్‌టీజింగ్ 02 04
ఇతరత్ర కేసులు 35 -
మొత్తం 1,064 761
- తాజా ఘటనలు...
మహిళలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయనే ందుకు తాజా ఘటనలే ఉదాహరణలు. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన బాలికను (15) ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన పేరబోయిన సాయికృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులు సాయికృష్ణ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా అతను వేధింపులు ఆపకపోవడంతో ఆ బాలిక ఈనెల 9న పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందింది.
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన కిషోర్, వీరేందర్ అనే తాపీ మేస్త్రీలు భద్రాచలంలో భవన నిర్మాణ పనుల నిమిత్తం వచ్చి స్థానిక సుందరయ్య నగర్లో ఉంటున్నారు. వారు ఉండే ప్రాంతంలోనే నివసించే ఓ ఇద్దరు 16 ఏళ్లలోపు యువతులపై శనివారం రాత్రి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా రెండురోజుల్లో ఉమ్మడి జిల్లాలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2017 డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన సఖి కేంద్రాలకు ఉమ్మడి జిల్లాలో ఈ తరహా కేసులు 178 వరకు రావడం బాలికలపై వేధింపుల తీవ్రతకు నిదర్శనం.
- కరోనాతో పెరిగిన వేధింపులు...
కోవిడ్-19 ప్రారంభం నుంచి మహిళలపై వేధింపులు అధికమయ్యాయని సఖి, ఖమ్మం జిల్లా కేంద్రం అడ్మిన్ శ్రావణి తెలిపారు. ముఖ్యంగా గృహ హింస, వివిధ కారణాలతో వేధిస్తున్న కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. మార్చి 2019 నుంచి మార్చి 2020 వరకు 313 కేసులు నమోదు కాగా కరోనా లాక్డౌన్ మొదలైన ఏప్రిల్ 2020 నుంచి ఆగష్టు 2021 వరకు 465 కేసులు ఒక్క ఖమ్మం జిల్లాలోని సఖి కేంద్రానికి వచ్చాయి. అంటే దాదాపు 65% పైగా కేసులు అధికంగా నమోదయ్యాయన్న మాట. వీటిలో గృహ హింస కేసులు ఎక్కువశాతం ఉన్నాయి. కరోనా మొదటి, రెండో దశల్లో కలిపి సంవత్సరంనర కాలంలో దాదాపు ఆరునెలల పాటు లాక్‌డౌన్‌తో ఇంటిల్లిపాది గృహాలకే పరిమితం అవడంతో మహిళలకు పనిభారం అధికమైంది. వర్క్‌ఫ్రం హౌం కారణంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి వచ్చి స్వస్థలాల్లో ఉంటూ అనేక మంది మహిళలు విధులు నిర్వహించారు. వీరు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించలేక సతమతమయ్యారు. భర్త, పిల్లల నుంచి కూడా ఒత్తిడి అధికమై ఆ బాధలు భరించలేక పలువురు సఖి కేంద్రాలను ఆశ్రయించారని కొత్తగూడెం జిల్లా అడ్మిన్ శుభశ్రీ తెలిపారు.
సఖి కేంద్రాలను సంప్రదించాలంటే 181 టోల్‌ఫ్రీ నంబర్‌కు డయల్ చేయవచ్చు.