Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దుర్వాసనతో కంపు
అ పరిశుభ్రతపై పట్టింపులేని సిబ్బంది
అ కానరాని వైద్యులు
అ సందర్శనలు లేని ఉన్నతాధికారులు
నవతెలంగాణ-ఇల్లందు
ప్రజా రోగ్యమే ధ్యేయం అంటూ ప్రభుత్వం చెప్పే మాటలు సూక్తులుగానే మిగులుతున్నాయి. వైద్యశాలలో అడుగు పెడితే కుక్కలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి దవాఖాన వరండాలో, లోపల పడుకుని ఉంటున్నాయి. రోగులు కనపడితే బౌభౌ మంటూ మీద పడుతున్నాయని బాధితులు అంటున్నారు. కంపు వాసనతో దుర్గంధం వెదజల్లుతోంది. లోపలికి వెలితే ఉన్న రోగాలు నయం కావడమేమోకాని కొత్త రోగాలు వస్తాయేమోనని రోగులు భయపడుతున్నారు. దావఖానలలో వైద్యులు నలుగురు, పారిశుధ్య సిబ్బంది ఆరుగురు పనిచేస్తుండగా దవాఖనలో అన్ని సెక్షన్లు కలిపి మొత్తం 50 మందికి పైగా సిబ్బంది పనిచేసు ్తన్నారు. పరిశుభ్రతపై పట్టిపులేదని తాజ ఘటన వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ఆదివా రం ఉదయం 11.30కి వైద్యశాల కౌంటర్లో ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. వైద్యులు లేరు. సరియైన వైద్యం అందక ఉన్న రోగులు అవస్ధలు పడుతు కూర్చున్నారు. వైద్యశాల ఇన్చార్జి, ఎక్స్‌రే, వ్యాక్సి నేషన్, పంటి, కంటి తదితర గదులకు తాళాలు వేసి ఉన్నాయి. వైద్యశాలల్లో పూర్తి స్ధాయి వైద్యులు సిబ్బందిని నియమింలేదు. పరిశుభ్రతపై ఉన్నతా ధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టిచుకోవడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. దీంతో వైద్యశాల అస్థ వ్యస్ధంగా మారుతోంది. గత మూడు రోజు ల నుండి ప్రభుత్వ సెలవులు ఉండటంతో వైద్యులు, సిబ్బంది వైద్యశా లకు సక్రమంగా రావడంలేదని మండల ప్రజలు తెలుపుతు న్నారు.
వచ్చిన వారికి నర్సులే రిజిస్టర్లో పేరు నమోదు చేసుకు ని మాత్రలు ఇస్తు న్నట్టు తెలిసింది. ఇది నియోజకవర్గ కేంద మ్రైన ప్రభుత్వ 30 పడకల దవాఖాల పరిస్థితి. వివరణ కోరేం దుకు వైద్యశాల ఇన్చార్జి డాక్టర్ సతీష్‌కు ఫోన్ చేయగా లిప్ట్ చేయలేదు. ఇప్పటికైనా వైద్యశాల పరి శుభ్రత, రోగులకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.