Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాద్ ఎంపీ మాలోతు కవితలు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సమయంలో దేవస్థానం తరపున శాలువ, జ్ఞాపిక, స్వామి వారి ప్రసాదంను దేవస్థానం ఈవో బి.శివాజీ వారికి అందజేశారు.