Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈ నెల 24న జరిగే దేశ వ్యాప్త సమ్మె సన్నాహక జిల్లా సదస్సు ఈ నెల 16న జరపాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ అధ్యక్షతన సీఐటీయూ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం నిర్ణయించిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలలో పని చేస్తున్న కోటి మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, స్కీమ్ల ఎత్తివేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. రూ.10 వేల కనీస పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకు జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు యం.వి.అప్పారావు, కోశాధికారి జి.పద్మ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నారాటి ప్రసాద్, ఇఫ్య్టూ జిల్లా ఉపాధ్యక్షులు సంజీవ్, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం, సంఘాల జిల్లా నాయకులు వీరన్న, శైలజ, ఝాన్సి, రామచంద్రం, లత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.