Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
వీర తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో పేదలకు పదిలక్షల ఎకరాల భూమిని పంచి, మూడు వేల గ్రామాలను దోరల దోపిడి, పాలన నుండి విముక్తి చేసి గ్రామస్వారాజ్యం సృష్టించడం జరిగిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం స్థానిక శ్రామికభవనంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ...ఆ పోరాటంలో బీజేపీ పది గజాల భూమి కూడా పంచలేదన్నారు. ఆ యుద్ధంలో వేలకొద్ది గడీలు నేల కూలాయని ఆందులో ఇక ఇటుక ముక్క జరగడంలో కూడా మీ పాత్ర లేదని బీజేపీని విమర్శించారు. నాడు వేల టన్నుల ధాన్యం దొరల ధాన్యగారాల నుండి తీసి పేదలకు పంచామన్నారు. మీరు పావుసేరు కూడా పంచలేదన్నారు. దొర నీ కాళ్లు మొక్కుతా.. దొర అన్న పేద పుత్రుల చేత ఆ పోరాటం గుతుప, గునుపం, తుపాకిని పట్టించిందన్నారు. 4వేల మంది ఎర్ర జెండా బిడ్డలు నైజాం, భూస్వామ్య సైనాన్ని, రాజకారు ముష్కరులను, పటేల్ సైనాన్ని ఎదిరించి పోరాడి తమ ప్రాణాలను తృణపాయంగా ఆర్పించా రన్నారు. ఆ పోరాట వారసత్వాన్ని పునికిపుచ్చుకోని ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోరాటాలలో పీడికులల్లో హిందువులు, ముస్లీంవులు వున్నారన్నారు. ఈనెల 17వ తేదిన వీర తెలంగాణ విప్లవ పోరాట వారసత్వ సదస్సు ప్రతి మండలంలో నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, కోడిశాల రాములు, గద్దల శ్రీనివాస్, ఉప్పతల నర్సింహారావు, నాగమణి, ముల్కల ఉత్తమ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.