Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కోవిడ్ పుణ్యమా అని రోగులను పరీక్షించడంలో వైద్యులకు రోగులకు మధ్య దూరం పెరిగింది. కానీ, ఫీజు వసూళ్లలో ఏ మాత్రం తగ్గలేదని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. నాడిపట్టి పరీ క్ష చేయకుండానే మందుల చీటి తయారు అవుతుంది. రోగి చెప్పే తన బాధలు డాక్టర్లకు విసుగ్గా అనిపిస్తున్నాయి. కొంత మంది వైద్యులు మాత్రం రోగుల పట్ల కస్సుబుస్సు లాడుతు న్నారు. వారి బాధను అర్ధం చేసుకుని రోగికి మానసిక ధైర్యం...వైద్యం చేసే వైద్యం కరువైందని తెలుస్తుంది.
రోగికి మోయలేని ప్రిస్కిప్రిషన్, టెస్టులు రాసి పంపిస్తున్నారు. ఇన్పేషేంట్గా ఉన్న వారి పిరిస్థితి మరింత ధారుణంగా మారింది. ఎక్కడ ఎదిరించి మాట్లాడితే వైద్యం సక్రమంగా చేయరోనని భయంతో ఆందోళన చెందుతున్నారు. రోగుల పట్ల డాక్టర్లు కస్సుబుస్సులాడినా పర్వాలేదని, సర్దుకుపోవడంతో డాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.
కోవిడ్లో ప్రాణాలు కాపాడారు...
కోవిడ్-19 కరోనా వైరస్ కారణంగా వైరస్ సోకిన వేలాది మంది రోగులను కాపాడిన తీరు వాస్తవమే..! అయినప్పటికీ ఇతర వ్యాధులతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రికి వెళుతున్నవారి పట్ల వైద్యులు ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోగి లక్షణాలను బట్టి రూ.వేల మందులు, ఇతర రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందే తప్ప నాడీపట్టి వైద్యం చేయని వాస్తవాలు కనిపిస్తున్నాయి.
వసూళ్లలో తగ్గేదిలేదు...
రోగం లక్షణాలు... రోగి చెప్పిన వివరాల ప్రకారం ప్రిస్కిప్షన్ రాసి, విధ రకాల పరీక్షలు చేయిస్తున్నారు. టెస్టుల పేరుతో రూ.వేలు దండుకుంటున్నారు. కానీ రోగికి మాన సిక చికిత్స చేయడంలేదు. ముఖ్యంగా ప్రైవేటు వైద్యశాలలో రూ.లక్ష ఫీజు వసూలు చేస్తున్న డాక్టర్లు సైతం ఈ విషయంలో రోగుల పట్ల దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు కనబడుతుంది. ఇటీవల చండ్రుగొండకు చెందిన వృద్ధురాలు కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ ఏరియాలోని ఎముకల (ఆర్థోపెడిక్) వైద్యుని దగ్గరకు వెళ్లి బాధను విన్నవించేలోపే డాక్టర్ కస్సుబుస్సులాడిన తీరు బాధను కలిగించిందంటున్నారు.
ఇటీవల కొత్తగూడెం పట్టణంలోని గణేష్ టెంపులు ప్రాంతంలో ఉన్న అసుపత్రిలో రోగి పట్ల అనుసరించిన తీరు, వెలుగు చూసిన సంఘటన ఇందుకు నిదర్శనంగా ఉం ది. రోగి చనిపోయాడని తెలిసి కూడా వైద్యం అందించారని, రోగి కుటుంబ సభ్యుల నుండి రూ.లక్షలాది వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది.
కోట్లు పెట్టి ఆసుపత్రుల్ని నిర్మిస్తున్నదీ ప్రజా సేవ చేయడానికి కాదు కదా...? అంటున్నారు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న సంస్థలు. నిజమే కానీ, వైద్యం అనేది పవిత్రమైన వృత్తి... వాస్తవానికి అది వృత్తి కాదు బాధ్యత. ప్రవిత్రమైన సేవ. సాటి మనిషి ప్రాణాల్ని కాపాడటం అంటే అది దైవకార్యంగా ప్రజలు నేటికీ ప్రజలు భావిస్తారు. దాన్ని ఓ వృత్తిగా ఎలా భావించగలం? ఇప్పటికైనా పవిత్రమైన వృత్తిలోఉన్న వైద్యసేవా రంగంగా భావించి రోగులకు మానసిక వైద్యం అందించాలని, వైద్యులపై ఏర్పడుతున్న అభిప్రాయాలు తొలిగి పోయేలా వైద్య సేవలుండాలని ప్రజలు కోరుతున్నారు.
కోవిడ్ కారణంగా మారింది : డాక్టర్ శిరీష, డీఎం అండ్ హెచ్ఓ
డాక్టర్లు నాడిపట్టి...స్థెథస్స్కోప్ పెట్టి పరిశీలించి వైద్యం చేయాలి. కానీ కోవిడ్ కరోనా వైరస్ కారణగా వైద్యులు కూడా భయ పడుతున్నారు. వారి ప్రాణ రక్షణ కోసం అలా చేస్తున్నారు. కోవిడ్ తగ్గింది. ఇప్పటికైనా రోగుల పట్ల వారు సానుకూలంగా వ్యవహరించి, వారి బాధను విని వైద్యం అందించాలి. రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.