Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అద్భుత ప్రతిభ కనబరిచిన యువత
అ క్రీడాకారులు దేశానికి కీర్తి తేవాలి
అ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,
డీఎస్పీ వెంకటేశ్వర బాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
యువత అద్భుత ప్రతిభ కనబరిచి రాణిస్తున్నారని, క్రీడాకారులు దేశానికి కీర్తి తేవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబులు అన్నారు. రెండు రోజుల పాటు జరిగిన లక్కినేని గోపీనాథ్ మెమోరియల్ షటిల్ బ్యాడ్మింటన్ ఫ్రెండ్లీ టోర్నమెంట్ ఆదివారం రాత్రి విజయవంతంగా ముగిశాయి. చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లోని సింగరేణి ఆర్ఓసి క్లబ్ నందు నిర్వహించారు. రెండు రోజుల పాటు 70 జట్లు టోర్నమెంట్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచాయి. ఈ టోర్ని ముగింపు కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్య నారాయణ, ఏపీపీ ఫణికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత క్రీడల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. కొత్తగూడెంలో వందల మంది బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఉన్నారని, వారికి అన్నిరకాలుగా తోడ్పాటు నందిస్తామని తెలిపారు. కొత్తగూడెం షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ల కోసం ఇండోర్ స్టేడియం ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి వల్ల దూరమైన లక్కినేని గోపీనాథ్ సేవల గురించి కొనియాడారు. ఈ టోర్నమెంట్లో మొదటి స్థానం సాధించిన తుత్తురు దామోదర్, సయ్యద్ యాకూబ్ భాగస్వాములు, 2వ స్థానం సాధించిన రవిరాజ్, పాషా భాగస్వులు, 3వ స్థానం సాధించిన రాజ్ కుమార్, హసన్ భాగస్వాములు, 4వ స్థానం సాధించిన వేణుగోపాల్ భాగస్వాములకి బహుమతులను అందించారు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు సొతుకు శ్రీనివాస్, జి.హరి కృష్ణ, ఇల్లుటూరి రాజ్ కుమార్, హసన్, సయ్యద్ యాకూబ్, సుధాకర్, ధరావత్ రమేష్ లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ శీలం శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, లక్కినేని సత్యనారాయణ, ఎండి. రజాక్, గురజాల వెంకట్, నాగరాజు, పాల్గొన్నారు.