Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరస్తులకు శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలి
అ జిల్లా ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు బాధ్యతగా కృషి చేయాలని, పొక్సో కేసులలోని నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ''క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్'' ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంలో అధికారులంతా న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతీ కేసు వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. కొత్త కొత్త మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజల నగదును దోచుకోవడానికి యత్నిస్తున్నారని, ఇట్టి నేరగాళ్ల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. చోరీ కేసులలో నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు న్యాయం చేకూర్చే విధంగా కషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మణుగూరు ఏఎస్పీ శబరీష్, భద్రాచలం ఏఎస్పీ వినీత్.జి, అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె.ప్రసాద్, కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు, ఇల్లందు డిఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ సిఐ బాలకృష్ణ, సిఐలు పాల్గొన్నారు.