Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ-బోనకల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఎటువంటి సంబంధంలేని బిజెపి ప్రస్తుతం తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ముస్లిముల, హిందువుల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పోతినేని సుదర్శన్ రావు, పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు మాదినేని నారాయణలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ(ఎం) జెండాను పోతినేని సుదర్శన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ సష్టించేందుకే వెయ్యి ఊడల మర్రిచెట్టు వద్ద తెలంగాణ విమోచన కార్యక్రమానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరవుతున్నట్లు ఆయన విమర్శించారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భక్తి, విముక్తి కోసం సాగిన పోరాటంలో నాలుగు వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. భారతదేశానికే ఆదర్శంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిలిచిందన్నారు. అటువంటి పోరాటాన్ని బిజెపి విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని, ఈ ప్రయత్నాలను ప్రజల తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ పోరాటంలో గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన అనేక మంది నాయకులు తమ ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. గ్రామానికి సాయుధ పోరాటంతో విడదీయరాని సంబంధం ఉందన్నారు. అంత ప్రాధాన్యత గల వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రజలందరూ స్పూర్తిగా తీసుకొని ఉద్యమాలకు రావాలని కోరారు. కెసిఆర్ ప్రజల భూములను ప్రైవేటు దారులకు కట్ట పెడుతుండగా బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబె దుతున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రయత్నాలను సీపీఐ(ఎం) నికరంగా నిలబడి వ్యతిరేకిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు ఉమ్మ నేని రవి, ఏడునూతల లక్ష్మణరావు, జొన్నలగడ్డ సునీత, గోవిందాపురం ఎల్ శాఖా కార్యదర్శి కోట కాటయ్య, లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, సిపిఎం నాయకులు కళ్యాణపు శ్రీనివాసరావు, తమ్మారపు లక్ష్మణరావు, నల్లమోతు నాగేశ్వరరావు, నల్లమోతు వాణి, పసుపులేటి హైమావతి, కొమ్ము కమలమ్మ ,ఏసుపోగు బాబు తదితరులు పాల్గొన్నారు.