Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనని, సంబంధం లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు సెప్టెంబర్ 17 వీర తెలంగాణ సాయుధ పోరాటం గురుంచి మాట్లాడే అర్హతే లేదని, కమ్యూనిస్టులే ఆ పోరాటానికి నిజమైన వారసులని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం మున్సిపల్ మాజీ చైర్మన్ ఆదర్శ నేత చిర్రావూరి.లక్ష్మీనర్సయ్య గారి 13వ వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సర్కిల్ లో ఉన్న చిర్రావూరి గారి విగ్రహానికి సీపీఎం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.తొలుత సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్ర. శ్రీకాంత్ గారు పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం సీపీఎం వన్ టౌన్ కార్యదర్శి యమ్. డి.జబ్బార్ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో నున్న. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చిర్రావూరి గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకులలో ఒకరని, నీతి నిజాయితీకి నిలువుటద్దం అన్ని అన్నారు. నేడు బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటం గురుంచి మాట్లాడుతుంది, కానీ అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్యస్యస్, బీజేపీ ఆ పోరాటంలో ఎక్కడా పాల్గొనకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడ పాల్గొన్నదో ఎంత మంది జైలుకి వెళ్ళేరో సమాధానం చెప్పాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అప్రోజ్ సమీన మాట్లాడుతూ.. ఖమ్మం మున్సిపాలిటీలో నేటికీ చిర్రావూరి పాలన గుర్తులే ఉన్నాయని, మున్సిపాలిటీలో నీతిగా నిజాయితీగా పనిచేసి రాష్ట్రంలోనే గుర్తింపు పొందేలా ఖమ్మం ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేత అని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం కమిటీ సభ్యులు యర్ర. శ్రీనివాసరావు, తుశకుల లింగయ్య, డివైయఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, వన్ టౌన్ పార్టీ నాయకులు బేగం, అజిత, డివైయఫ్ఐ నాయకులు వీరబాబు, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.