Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగర పాలక సంస్థలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ తదితర పద్దతుల్లో పనిచేస్తున్న కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్పీ 60 నెం.జి.ఓ ఆధారంగా వెంటనే కార్మికులకు వేతనాలు పెంచి కేటగిరీల వారీగా వేతనాలతో పాటు ఏరియర్స్ జూన్ నెల నుండి చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు జి. రామయ్య, ఐఎన్టియుసి మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు యం.జయరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఉదయం కార్పొరేషన్ కార్యాలయం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీ.ఓ. జారీచేసి చేతులు దులుపుకొని వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తక్షణమే మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారిగా వేతనాలు సాధించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఎఐటియుసీ, ఐఎఫ్ టియు,ఐయన్ టియుసి తదితర మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జినక శ్రీను, దొడ్డా నర్సింహారావు, నాగేశ్వరరావు, పద్మా, జానికమ్మ, విజయ, అరుణ,బి.ఉపెందర్, సత్యం, ఐఎటియుసి మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా నాయకులు షేక్ హుస్సేన్, బి.పాపారావు, శ్రీనివాస్, టి.నాగమణి,పాపమ్మ, ఐఎఫ్ టియు ఖమ్మం నగర అధ్యక్షులు ఆడెపు రామారావు, కార్యదర్శి కంకణాల శ్రీనివాస్, మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి. రాములు, కె. నారాయణ, డి. గురవయ్య, సంగమ్మ, ఐయన్టియుసి మున్సిపల్ కార్మిక సంఘం యన్.కృష్ణ, లింగన బోయిన మహేష్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.