Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పట్టా భూములను నిషేధిత జాబితా
నుండి తొలగించాలి
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-రఘునాథపాలెం
ధరణి పోర్టల్ లోని తప్పులను, నిషేధిత జాబితా పొరపాట్లను తక్షణమే సరిచేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన సీపీఐ(ఎం) రఘునాథపాలెం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ఇబ్బందులను తెచ్చిపెట్టిందని అన్నారు. భూమికి సంబంధించి అన్ని పాత్రలు ఉన్న, తాతల కాలం నుండి సాగుచేసుకుంటున్న పట్టా భూములను ధరణిలో మాత్రం నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని అన్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం తమ సొంత భూమిని అమ్ముకోలేని పరిస్థితుల్లో కి అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం నెట్టిందని విమర్శించారు.
భవిష్యత్తులో ధరణి పోర్టల్ వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, రఘునాధపాలెం మండల కార్యదర్శి ఎస్. నవీన్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు ప్రతాపనేని వెంకటేశ్వరరావు, భూక్య కృష్ణ, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, నాదెండ్ల పుల్లయ్య, వల్లూరి శ్రీనివాస్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్.ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.