Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే సండ్ర సహకారం
నవతెలంగాణ-కల్లూరు
కల్లూరు మేజర్ పంచాయతీ పరిధిలోని శాంతినగర్ నివాసి అయిన చీలి అన్వేష్(20) వింతవ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య వైద్య కోసం సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గులియన్ బారీ'స్ సిండ్రోమ్(జీబీఎస్) అనే వైరస్ లక్షణాలు రావడంతో కొన్ని రోజుల్లోనే కాళ్ళు పూర్తిగా చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకోవడంతో తల్లి కొడుకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిరుపేదలైన ఆ కుటుంబం, చికిత్సలో భాగంగా ఒక్కో ఇంజెక్షన్ రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని, 4 ఇంజక్షన్లు కోర్సుగా వాడాలని డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో శాంతినగర్ కాలనీకి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను సోమవారం సత్తుపల్లిలో కలసి విషయం చెప్పారు. స్పందించిన ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో సంబంధిత డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ లెటర్ రాసి, పూర్తి సహాయ సహకారాలు అందిస్తాని భరోసా ఇచ్చారు. కొంత ఆర్థిక సహాయం అందజేశారు.
అదేవిధంగా శాంతినగర్ యూత్, కాలనీ వాసులు ఆర్దిక సహాయం అందించి బాసటగా నిలిచారు. స్థానిక సర్పంచ్ లక్కినేని నీరజ రఘు, రైతు స.స. ప్రతినిధులు పసుమర్తి చంద్రరావు, డా. లక్కినేని రఘులు పరామర్శించి, కొంత ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ మాజీ ఎంపీటీసీ ఖమ్మంపాటి పుల్లారావు, ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు, సాయిలు, బాబూరావు, యం.టైసన్, ఎన్. కోటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, ప్రజా ప్రతినిధులు కొండూరి కిరణ్ కుమార్, ఖమ్మంపాటి స్వరూప రమేష్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, కృతజ్ఞతలు తెలిపారు.