Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని జలగం నగర్ కాలనీలో సోమవారం శాఖ మహాసభ కొడవళ్ళ శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమా వేశంలో ప్రసాద్ మాట్లాడుతూ భూమి, భుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగువేల మంది వీరులు అమరులయ్యారని తెలిపారు. ఆ పోరాట స్పూర్తితో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింద న్నారు. మండలంలో గంగవరపు శ్రీనివాసరావు, చిర్రావూరి లక్ష్మీనరసయ్య, మంచికంటి రాంకిషన్‌రావు, తమ్మినేని సుబ్బయ్య, వజ్జా వెంకయ్య, గుర్రం సూరయ్య, పెద్ద మల్సూర్, చిన్న మల్సూర్ లాంటి వీరులు సాయుధ పోరాట నాయకులన్నారు. వాళ్ల స్ఫూర్తితోనే మండలంలో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు బలమైన శక్తిగా ఏర్పడిందన్నారు. ఈ నెల 17న జరిగిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఎం శ్రేణులకు పిలుపునిచ్చారు.అనంతరం నూతన శాఖ కార్యదర్శిగా ఏర్పుల శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల శ్రీనివాసరావు, కార్పొరేషన్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్‌రెడ్డి, మండల నాయకులు పొన్నెకంటి సంగయ్య, పి.మోహన్‌రావు, బందెల వెంకయ్య, నందిగామ కృష్ణ, ఏటుకూరి ప్రసాద్‌రావు, పద్మ, మొరబోయిన పుల్లయ్య, ఉపేందర్, నూకల బాలరాజు, ఖాజామియా, పి.యమున, ఎస్.రాము, అంజయ్య, రాహుల్ పాల్గొన్నారు.